మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్నకాంబినేషన్ సాకారం కాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి పైడిపల్లి వంశీ దర్శకత్వం వహిస్తారు. నిర్మాత దిల్ రాజు.
ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రం లో మెయిన్ హీరోగా నటించబోతున్నారు. ఇద్దరు ప్రముఖ హీరోలూ ఈ సినిమా లో నటిస్తున్నప్పటికీ, వీరిరువురూ ఒకే సారి తెరపై కనిపించరు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక కీలక మైన పాత్రను అల్లు అర్జున్ పోషించబోతున్నారని సమాచారం.
మొత్తానికి ఈ వార్త చరణ్, అర్జున్ అభిమానులిద్దరికీ ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరుంటారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మూవీకి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.