సోషల్ డిస్టెన్సింగ్ ఆధారంగా థియేటర్స్ లో సీట్ల నిర్మాణం.

సోషల్ డిస్టెన్సింగ్ ఆధారంగా థియేటర్స్ లో సీట్ల నిర్మాణం.

Published on May 31, 2020 6:13 PM IST


రానున్న రోజులలో సోషల్ డిస్టెన్స్ ప్రాధాన్యం మరింత పెరిగేలా ఉంది. ఇక థియేటర్స్ లో సైతం సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన పరిస్థితి. దీనికి అనుగుణంగా థియేటర్స్ సీట్ల నిర్మాణం కూడా ఉండేలా థియేటర్ యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఆర్ టి సి క్రాస్ రోడ్స్ నందు గల సుదర్శన్ థియేటర్స్ లో ఇప్పటికే దీనికి సంబందించిన ఏర్పాట్లు మొదలయ్యాయి.

ఆ థియేటర్ లో సీటింగ్ సిస్టమ్ మార్చివేస్తూ మరమత్తులు చేస్తున్నారు. ప్రేక్షకులు కూర్చుండే సీట్స్ మధ్య కనీసం మూడు అడుగుల గ్యాప్ తో సీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్స్ కి అనుమతులు రాగా కొద్దిరోజులలో థియేటర్స్ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీటింగ్ మరియు అనేక విషయాలలో గవర్నమెంట్ నార్మ్స్ మారనున్నాయి. అందుకే ఇప్పటికే కొన్ని థియేటర్ యాజమాన్యాలు దీనిపై దృష్టి సారించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు