బాక్సాఫీస్ మాన్స్టర్ “సాహో” కు ఏడాది.!

బాక్సాఫీస్ మాన్స్టర్ “సాహో” కు ఏడాది.!

Published on Aug 30, 2020 10:03 AM IST

బాహుబలి చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తాడు? అరె అంత పెద్ద ప్రాజెక్ట్ అనంతరం చిన్న సినిమా చేస్తే బాగుంటుందా? అసలు ఎలాంటి జానర్ లో కనిపిస్తాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రభాస్ మరియు ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ను ఆ టైం లో తొలిచేసేవి. అలాగే రాజమౌళి లాంటి పెద్ద దర్శకునితో చేసాడు ఈసారి ఏ డైరెక్టర్ తో చేస్తాడు అని ఎన్నో అనుమానాలు పడుతున్న సందర్భంలో కేవలం సీనియార్టీకి ప్రియార్టీ ఇవ్వకుండా యువ దర్శకులలో ఉన్న ప్రతిభను కూడా తన స్టార్డం తో చాటి చెప్పాలని ఊహించని ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసాడు ప్రభాస్.

ఆ చిత్రమే “సాహో”. ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్లు అప్పుడప్పుడే అయినా సరే దర్శకుడు సుజీత్ ప్లానింగ్ మాత్రం ఇతర హీరోల అభిమానులకు కూడా గూస్ బంప్స్ తెప్పించే పని చేసాయి, ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మన తెలుగు నుంచి బాలీవుడ్ మరియు హాలీవుడ్ ప్రామాణికాలకు ఏమాత్రం తీసిపోకుండా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులతో తెరకెక్కించారు. అలా ఎన్నో అంచనాలు నెలకొలుకున్న ఈ చిత్రం విడుదలై సరిగ్గా నేటికి ఏడాది అయ్యింది.

టాక్ తో ఎలాంటి సంబంధం లేకుండా 400 కోట్లు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుళ్లగొట్టేసింది. అది కూడా ఒక బెంచ్ మార్క్ లా ఈ చిత్రానికి నిలిచింది. కేవలం ప్లాప్ టాక్ తో కూడా ఈస్థాయి వసూళ్లను రాబట్టింది అంటే హిట్ టాక్ తెచ్చుకుంటే? అదే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఏ రేంజ్ లో ఉండేది అని ప్రభాస్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. అందుకే ఇపుడు సోషల్ మీడియాలో బాక్సాఫీస్ మాన్స్టర్ సాహో అని వన్ ఇయర్ ట్రెండ్ ను చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు