విడుదల తేదీ: 27 డిసెంబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5 |
||
దర్శకుడు : అనీష్ యోహాన్ కురివిల్లా |
||
నిర్మాత : శర్వానంద్ | ||
సంగీతం : శక్తికాంత్ కార్తీక్ |
||
నటీనటులు : శర్వానంద్, ప్రియా ఆనంద్,శ్రీహరి |
రొటీన్ మూస ప్రేమకథలకి దూరంగా ఉంటూ విభిన్నమైన సినిమాలు చేసే శర్వానంద్ ఈ సారి శర్వా ఆర్ట్స్ సొంత బ్యానర్ ప్రొడక్షన్లో ‘కో అంటే కోటి’ సినిమా చేసాడు. శర్వానంద్, శ్రీహరి, ప్రియా ఆనంద్ నటించిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. అవకాయ్ బిర్యాని ఫేం అనీష్ కురివిల్లా రెండవ ప్రయత్నంగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ :
మాయా మాస్టర్/మయలోరి మదన్ (శ్రీహరి) ఒక చిన్న దొంగ. మాయా మాస్టర్ ఒక దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడతాడు. జైలులో ఉండి డైమండ్ హౌస్ లో ఉన్న బ్లాక్ మనీ దొంగతనం చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు. ఆ దొంగతనం చేయడం తన ఒక్కడి వల్ల కాదని చిట్టిగాడు (లక్ష్మణ్), బుజ్జిగాడు (నిశ్చల్) తో ఒక టీం రెడీ చేసుకుంటాడు. చిన్న దొంగతనాలు చేసి విసుగు వచ్చి సత్య (ప్రియా ఆనంద్) ని పెళ్లి చేసుకుని మంచి మనిషిగా బతకాలని అనుకున్న వంశి (?) (శర్వానంద్) ని కూడా మాయా మాస్టర్ బలవంతంగా తన టీంలో జాయిన్ చేసుకుంటాడు. ఇష్టం లేకపోయినా వంశి ఈ దొంగతనానికి ఒప్పుకుంటాడు. వీరంతా దొంగతనం చేసి పారిపోతుండగా అనుకోని ప్రమాదం జరుగుతుంది. దొంగతనం తరువాత ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు. ఎవరు ఎవరిని మోసం చేసారు. చివరికి ఆ డబ్బు ఎవరికి దక్కింది అనేది మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్ :
శర్వానంద్ గతంలో చేసిన పాత్రల కంటే ఇందులో కొత్తగా ఏమీ లేదు కానీ వంశి పాత్రకి తన వంతు న్యాయం చేసాడు. మూస పాత్రలకి దూరంగా ఉంటూ ఇలాంటివి ఎంచుకుంటున్నందుకు అతన్ని అభినందించి తీరాలి. శ్రీహరి ఇలాంటి పాత్రలు చేయడంలో దిట్ట. శ్రీహరి చాలా వరకు సినిమాని సేవ్ చేసాడు. అతని పాత్రకి తగ్గట్లు కొన్ని డైలాగ్స్ కూడా బాగా పడ్డాయి. మిగతా వారిలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ పాత్ర చేసిన వినయ్ వర్మ పర్వాలేదు. సినిమా ప్రారంభమైన మొదటి ముప్పై నిమిషాల వరకు కొంత ఆసక్తికరంగా సాగి ఇంటర్వెల్ తరువాత దొంగతనం ఎపిసోడ్స్ అన్ని బాగానే చూపించాడు. కథలో కీలకమైన కొన్ని ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో కరెక్ట్ టైంలో వాడుకున్నాడు. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పర్వాలేదు.
మైనస్ పాయింట్స్ :
శర్వానంద్, ప్రియా ఆనంద్ మధ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్ని దారుణమైన స్లో నేరేషన్ తో సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు. వారిద్దరి మధ్య ప్రేమ పండించడానికి సత్యకి ఉన్న నాటకాల పిచ్చిని వాడుకుని అందులో శర్వానంద్ ని ఇరికించాడు. ఈ నాటకాల ఎపిసోడ్స్ అన్ని ఎడిటింగ్ సరిగా చేయకుండా పెట్టి చిరాకు తెప్పించాడు. మొదటి ముప్పై నిముషాలు బానే ఉందనుకున్న లోపే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే అర్ధం పర్ధం లేని పాటలు సినిమాలో ఉన్న సీరియస్ నెస్ దెబ్బతీసాయి. వీటికి తోడు చిట్టిగాడు లవ్ ట్రాక్ మనకు బంపర్ బొనంజా. బుజ్జిగాడితో డిల్లీ బెల్లీ కామెడీ చేయిద్దామని ట్రై చేస్తే అది కాస్తా మన మీద విష ప్రయోగం అయి కూర్చుంది. ఫింగర్ ఫెడ్రిక్స్ భయంకరమైన విలన్ అన్నట్లు చూపించారు. విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్లు సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడలేదు.
సాంకేతిక విభాగం :
గతంలో అవకాయ్ బిర్యాని సినిమా తీసిన అనీష్ కురివిల్లా మొదటి సినిమాలో చేసిన పొరపాట్లు ఈ సినిమాలో కూడా రిపీట్ చేసాడు. కథలో ఉన్న సీరియస్ నెస్ కథనంలో పూర్తిగా లోపించింది. అనవసరమైన సిల్లీ ఎపిసోడ్స్ అన్ని మధ్యలో ఇరికించి కంగాలి చేసాడు. మొదటి సినిమాలో లాగానే ఈ సినిమాలో హీరొయిన్ పాత్ర మీద “అతి” ప్రేమ చూపించి రియాలిటీకి చూపించాడు. నాటకాల ఎపిసోడ్స్ బాధ వర్నించలేనిది. సినిమాటోగ్రఫీ చాలా సన్నివేశాలకు వరకు బాగానే ఉన్నా దొంగతనం చేసిన తరువాత చేసిన తరువాత వచ్చే సన్నివేశాలన్నీ చెడగొట్టాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా సన్నివేశాలు ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది ప్రెసెంట్ స్టొరీ అనే అనుమానం కలిగించేలా ఉంది ఎడిటింగ్. శక్తి కాంత్ కార్తీక్ సంగీతంలో వరాల వాన, కో అంటే కోటి పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం పర్వాలేదు. ప్రవీణ్ బోయిన రాసిన కొన్ని డైలాగ్స్ బావున్నాయి.
తీర్పు :
గత కొన్ని రోజులుగా కో అంటే కోటి మీద చేస్తున్న ప్రమోషన్, ట్రైలర్స్ చుసిన వాళ్ళు డిఫరెంట్ మూవీగా ఉంటుందని ఆశించి వచ్చిన వారికి కొంత వరకే ఆకలి తీర్చి పంపించాడు. మంచి కథ ఎంచుకున్న దర్శకుడు కథనంలో బాగా తడబడి చివరికి నిర్మాతకి నిరాశ మిగిల్చాడు. మీరు భయంకరమైన సినిమా లవర్స్ అయితే ఫస్ట్ హాఫ్ ఓపిక పట్టి శ్రీహరి కోసం ఒకసారి చుడండి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
అశోక్ రెడ్డి .ఎమ్
CLICK HERE FOR English REVIEW