హీరో చియాన్ విక్రమ్ వరుసగా పెద్ద సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి మణిరత్నం చేస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి షెడ్యూల్ థాయిలాండ్ లొకేషన్లలో జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ప్రసుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో షూట్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్. అయితే విక్రమ్ ఇటీవలే కొత్త సినిమాకు సైన్ చేశారు. దీంతో ఆయన ముందుగా ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం మేరకు విక్రమ్ మాత్రం ముందు మణిరత్నం సినిమాలో జాయిన్ అవుతారట. జనవరి, ఫిబ్రవరిలో మొత్తం డేట్స్ మణిరత్నం సినిమాకే కేటాయించారట. అది పూర్తయ్యాకే తన 60వ చిత్రాన్ని మొదలుపెడతారట ఆయన. ఈ 60వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో విక్రమ్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనుండగా ఆయన కుమారుడు, హీరో ధృవ్ విక్రమ్ సైతం ఇందులో ఒక ఫుల్ లెంగ్త్ కీ రోల్ చేయనుండటం విశేషం. కాగా జనవరి ఈలోపు ‘కోబ్రా’ షూటింగ్ పూర్తిచేయాలని ప్లాన్ చేసుకున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రజెంట్ చెన్నైలో జరుగుతోంది.