వచ్చే ఏడాది బాలీవుడ్ లో తెరంగేట్రం చేయబోతున్న సమంతా, తాప్సీల సరసన ఇప్పుడు రిచా చేరిపోయింది. ‘లీడర్’ మూవీతో సినిమాల్లోకి ప్రవేశించిన రిచా, నాగవల్లి. మిరపకాయ్ చిత్రలూనూ తన ప్రతిభ నిరూపించుకుంది. తమిళంలో కొన్ని భారీ చిత్రాల్లోనూ రిచా నటించింది. వీటిలో సెల్వరాఘవన్ – ‘మయక్కం ఎన్న’ , సింభు – ‘ఓస్తి’ తదితర చిత్రాలున్నాయి. ఈ రెండు చిత్రాలు నవంబర్ లో విడుదయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి.
తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ప్రభాస్ రాబోయే చిత్రం లో నటించేందుకు రిచా ఈ మధ్యే సంతకం కూడా చేసింది. కాగా, రిచా బాలీవుడ్ లో రంగప్రవేశం చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఆమే స్వయంగా ధ్రువీకరించారు. నీల్ నితిన్ ముకేష్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘షార్ట్ కట్ రోమియో’ లో తాను నటించబోతున్నట్టు రిచా చెప్పారు. విక్రం- శ్రేయ జంటగా నటించిన ‘మల్లన్న’ (తమిళంలో కంటసామి) చిత్రానికి దర్శకత్వం వహించిన సుశి గణేషన్ ఈ చిత్రానికీ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
సంచలనం సృష్టించిన సుశి గణేషన్ సొంత చిత్రం ‘తిరుట్టు పయలె’ ను ఇప్పుడు హిందీలో పునః నిర్మిస్తున్నారు. అమీషా పటేల్ కూడా ఈ చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు.