విడుదల తేదీ : ఫిబ్రవరి 12, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి
దర్శకత్వం : బుచ్చిబాబు సానా
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
సంగీతం : దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ : షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్ : నవీన్ నూలి
టాలీవుడ్ ప్రేక్షక జనం ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ లవ్ స్టోరీ చిత్రం “ఉప్పెన”. మెగా హీరో వైష్ణవ్ నుంచి హీరోయిన్ కృతి, దర్శకుడు బుచ్చిబాబు వరకు డెబ్యూ మూవీగా వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతోనే ఈరోజు విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ:
ఇక కథలోకి వెళ్లినట్టయతే ఆశీ(వైష్ణవ్ తేజ్) ఒక నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందిన సాధారణ యువకుడు. కానీ అతని చిన్ననాటి నుంచే ఓ డబ్బున్న ఆసామి రాయణం(విజయ్ సేతుపతి) కూతురు సంగీత(కృతి శెట్టి)ని ప్రేమిస్తాడు. అలా కాలానుగుణంగా ఇద్దరూ కూడా ప్రేమించుకుంటారు. కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా కథ మరో విధంగా మలుపు తిరుగుతుంది. మరి ఇక్కడ నుంచి ఇద్దరి జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రాయణం ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు? చివరికి వీరి ప్రేమ ఏమయ్యింది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా మొత్తం చూసాక కూడా అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏది అన్న టాక్ వస్తే ఖచ్చితంగా అందుకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అనే సమాధానం ఏకధాటిగా వస్తుంది అని చెప్పాలి. సినిమా విడుదలకు ముందే దేవి సగం హిట్ చేసాడు. కానీ అది విజువల్ గా చూసేటప్పటికి మరో స్థాయిలో అనిపిస్తుంది. ప్రతీ పాట అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవీ అవుట్ స్టాండింగ్ అవుట్ ఫుట్ ఇచ్చారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఏ ఒక్కరూ కూడా ఎక్కడా తగ్గలేదని చెప్పాలి ముఖ్యంగా మెయిన్ లీడ్.వైష్ణవ్, కృతి లకు ఇదే మొట్ట మొదటి సినిమా అయినప్పటికీ వీరిచ్చిన పెర్ఫామెన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపిస్తాయి. వీరి నడుమ కెమిస్ట్రీ కానీ వీరిద్దరూ పలికించిన ఎమోషన్స్ కొన్ని సీన్స్ లో హావభావాలు అయితే చాలా టచ్చింగ్ గా ఉంటాయి. అలాగే వైష్ణవ్ నుంచి అయితే ఈ రేంజ్ పెర్ఫామెన్స్ ఎవరు ఊహించి ఉండరు. అతని కళ్ళలోని తీక్షణత పండించిన ఎమోషన్స్ అమోఘం.
ఇంకా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విషయానికి వస్తే తన ఈజ్ అండ్ సెటిల్డ్ నటన కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ సినిమాలో రాయణం రోల్ కు సాలిడ్ పెర్ఫామెన్స్ నుంచి మరో పెద్ద ప్లస్ గా ఈ చిత్రానికి నిలిచారు. మరి ఈ సినిమాలో మరో బిగ్ హైలైట్ కృతి రోల్ అని చెప్పాలి. ఆమె తన నటనతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే చాలా పరిణితి చెందిన నటనను ఆమె కనబర్చింది. ఇక ఈ చిత్రంలో డైలాగ్స్ కానీ కెమెరా వర్క్ కానీ కానీ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఇక ఈ సినిమాలో మేజర్ మైనర్ పాయింట్స్ కి వచ్చినట్టు అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. అందులో కనిపించిన గ్రిప్పింగ్ నరేషన్ కాస్త ఇక్కడ మిస్సవుతుంది. అలాగే ఇద్దరి మెయిన్ లీడ్ తీసుకునే నిర్ణయాలు కొన్ని సన్నివేశాలు పరమ రొటీన్ గానే అనిపిస్తాయి.
వీటి మూలాన చాలానే సన్నివేశాలు ఊహించేయగలుగుతాం. అయితే మరి క్లైమాక్స్ సాలిడ్ గానే ఉన్నా అంతవరకు వచ్చిన విజయ్ సేతుపతి రోల్ లో ఎక్కడో ఏదో మిస్సవుతున్న భావన ప్రేక్షకులకు ఖచ్చితంగా కలుగుతుంది. అంత స్ట్రాంగ్ గా ఉన్న పాత్ర ఒకానొక స్టేజ్ లో నిస్సయహాయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి అలాగే సేతుపతికి డబ్బింగ్ కూడా మార్చి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
మొదట్లో చెప్పినట్టు గానే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాను చాలా మేర నెట్టుకొచ్చేయడానికి ఆయువు పట్టులా నిలుస్తుంది. కథానుసారం వచ్చే సీన్స్ కు తాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ పాత దేవిని గుర్తు చేస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి ముఖ్యంగా సేతుపతికి రాసిన ప్రతీ డైలాగ్ కూడా అర్ధవంతంగా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్ లో కూడా అత్యున్నత నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ఎడిటింగ్ బాగుంది, కాస్ట్యూమ్ వర్క్స్ అన్ని బాగున్నాయి.
ఇక దర్శకుడు బుచ్చిబాబు సన విషయానికి వస్తే తన ఈ డెబ్యూ చిత్రంతో ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. కాస్త పాత రొటీన్ లైన్ నే ఎంచుకున్నా దానిని ఆసక్తికరంగా మలచడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మంచి కథనం, స్రీన్ ప్లే రాసుకున్నారు. అలాగే నటీనటుల నుంచి మంచి అవుట్ ఫుట్ ను రాబట్టుకొని తన మొదటి సినిమాకే మంచి మార్కులు వేసుకున్నారు. కొన్ని సీన్స్ బాగానే రాసుకున్నా సెకండాఫ్ ను ఇంకా బలంగా మంచి గ్రిప్పింగ్ తో తెరకెక్కించి ఖచ్చితంగా ఈ చిత్రం మరో స్థాయిలో ఉంటుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే మంచి క్యాస్టింగ్ అండ్ అంచనాలతో వచ్చిన ఈ “ఉప్పెన”, నటీనటుల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు, మరో అతి పెద్ద ఎస్సెట్ గా నిలిచే సంగీతం, ఎమోషన్స్ తో చాలా బాగా అనిపిస్తుంది. కానీ రొటీన్ పేద ధనిక కథా నేపథ్యం, సెకండాఫ్ లో ఇంపాక్ట్ తగ్గడం వంటివి కాస్త నిరాశ పరుస్తాయి, కానీ క్లైమాక్స్ మరో స్థాయికి తీసుకెళ్తుంది. సో ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడదగినదే.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team