విడుదల తేదీ : 09 జనవరి 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5 |
||
దర్శకుడు : వి.వి. వినాయక్ |
||
నిర్మాత : డి. వి. వి. దానయ్య | ||
సంగీతం : తమన్ |
||
నటీనటులు : రామ్ చరణ్, కాజల్, అమలా పాల్… |
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు “నాయక్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈరోజు ప్రసాద్ లాబ్స్ లో ప్రత్యేకంగాఈ చిత్ర ప్రీమియర్ ప్రదర్శించారు. ఒక రోజు ముందుగానే మీకు ఈ చిత్ర సమీక్షను తెలియజేస్తున్నాం ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా డివివి దానయ్య నిర్మించారు. కాజల్ మరియు అమల పాల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
చెర్రీ (రామ్ చరణ్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అతనికి జిలేబి(బ్రహ్మానందం) అనే అంకుల్ ఉంటాడు. జిలేబి అనుకోకుండా లోకల్ డాన్ అయిన గండిపేట బాబ్జి (రాహుల్ దేవ్) తో గొడవ పడతాడు. ఈ గొడవ నుండి జిలేబి ని కాపాడే ప్రాసెస్ లో చెర్రీ, బాబ్జి చెల్లెలు అయిన మధు (కాజల్) ని ప్రేమిస్తాడు.
ఇలా జరుగుతుండగా హైదరాబాద్ మరియు కోల్ కత్తాలలో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. మినిస్టర్ రావత్ ని చెర్రీ చంపెయబోతున్నాడు అని సిబిఐ టీం (ఆశిష్ విద్యార్థి) చెర్రీ కోసం వెతకడం మొదలు పెడుతుంది. దీంతో కథలో అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఇక్కడ నుండి మనకి కథలో మరో కోణం కనిపిస్తుంది. చెర్రీ సి బి ఐ నుండి ఎలా తప్పించుకున్నాడు? తను నిరపరాధి అని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే మిగిలిన కథ
ప్లస్ పాయింట్స్ :
రామ్ చరణ్ ఈ చిత్రంలో అద్భుతమయిన ప్రదర్శన కనబరిచారు ఈ చిత్రంలో అయన వాయిస్ మొడ్యులేషన్ చాలా బాగుంది. అయన మంచి డాన్సర్ అన్న విషయాన్ని మరో సారి నిరూపించారు. “లైలా ఓ లైలా” మరియు ” హే నాయక్” పాటలలో అయన డాన్స్ చాలా బాగుంది.
కాజల్ అగర్వాల్ చాలా అందంగా కనిపించడం మాత్రమే కాకుండా చరణ్ తో కలిసి చేసిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. అమలా పాల్ కి ఈ చిత్రంలో అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కలేదు చాలా కొద్ది సన్నివేశాలలో మాత్రమే కనిపించినా అందంతో ఆకట్టుకుంది.
బ్రహ్మానందం జిలేబి పాత్ర చిత్రంలో కీలకమయిన పాత్ర ఈ చిత్రంలో అయన ప్రేక్షకులను బాగా అలరించారు. అయన హావ భావాలూ మరియు పాత్ర కాస్త “కృష్ణ” చిత్రాన్ని తలపిస్తాయి. కోల్ కత్తా లో క్రిమినల్ గా పోసాని కృష్ణ మురళి చాలా బాగా నటించారు ద్వితీయార్ధంలో అయన చాక్లెట్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి.
ఎం ఎస్ నారాయణ సి.బి.ఐలో తాగుబోతు లిప్ రీడింగ్ స్పెషలిస్ట్ గా అందరిని నవ్వించారు. రాహుల్ దేవ్ కి పెద్దన్న పాత్రలో జయప్రకాశ్ రెడ్డి బాగా నటించారు.
చిత్ర మొదటి అర్ధం చాలా వేగంగా వినోదాత్మకంగా సాగుతుంది. కామెడీ మరియు యాక్షన్ అంశాలు సరయిన పాళ్ళలో కనిపిస్తుంది. రెండవ అర్ధం భాగం మొదలు కాగానే భారీ యాక్షన్ మరియు హింస ఉండటంతో కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది కాని పోసాని పాత్ర రాగానే కథ వేగం పుంజుకుంది. “కత్తి లాంటి పిల్ల”, “శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో” మరియు “ఒక చూపుకే పడిపోయా” పాటలు చూడటానికి చాలా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్ర కథలో కొత్తదనం లేదు గతంలో వచ్చిన పలు చిత్రాలను గుర్తు చేస్తాయి.ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ రాగానే తరువాత ఏం జరుగుతుందో ఊహించేయచ్చు. బేసిక్ ప్లాట్ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అన్ని మసాలా ఎంటర్ టైనర్స్ లానే ఈ చిత్రంలో కూడా అదే పనిగా జొప్పించిన అంశాలు కనిపిస్తాయి.
ద్వితీయార్ధంలో కథ ముందుకి కదలదు వినోదాత్మకమయిన సన్నివేశాలు ఈ విషయాన్ని కనపడకుండా అడ్డుకున్నాయి. కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఇందులో చూపించిన హింస నచ్చకపోయే అవకాశాలు ఉన్నాయి. ఫైట్స్ మరియు క్లైమాక్స్ కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటె మరింత బాగుండేది.
సాంకేతిక అంశాలు :
చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో చోటా కె నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ గురించి మొదట చెప్పుకోవచ్చు. ఐస్ ల్యాండ్ లో చిత్రీకరించిన పాటలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. డైలాగ్స్ బాగున్నాయి అందులోనూ కమెడియన్స్ కి రచించిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.
వి వి వినాయక్ కి మాస్ పల్స్ తెలుసన్న విషయం ఈ చిత్రంతో మరో సారి నిరూపించుకున్నారు కథలో కొత్తదనం లేకపోయినా చిత్రాన్ని వినోదాత్మకంగా మరియు వేగవంతంగా నడిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తీర్పు :
నాయక్ వినోదాత్మకమయిన చిత్రం. చిత్రంలో మంచి కామెడి ఉంది. చరణ్, బ్రహ్మానందం, పోసాని మరియు ఎం ఎస్ నారాయణ నటన చాలా బాగుంది. కాని హింసాత్మకం అయిన సన్నివేశాలు, ఊహించగల కథ మరియు అసంత్రుప్తికరమయిన క్లైమాక్స్ కాస్త నిరుత్సాహ పరుస్తాయి. మొత్తంగా “నాయక్” ఈ ఏడాది మొదటి హిట్ చిత్రంగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
123తెలుగు.కామ్ రేటింగ్ -3.5/5
అనువాదం రవి