ఎంత గొప్ప వ్యక్తులు అయినా కూడా వారి ప్రతిష్ట పడిపోడానికి క్షణిక కాలం కూడా పట్టదు. ఇపుడు అలాంటి అనుభవమే రియల్ హీరో సోనూ సూద్ కి ఎదురయ్యింది అని చెప్పాలి. గత ఏడాది ప్రపంచాన్ని కబళించేసిన కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా ఎలాంటి సేవలను సోనూ సూద్ అందించాడో ఎవరు మర్చిపోలేరు. అందుకే సోనూ సూద్ అవ్వడానికి రీల్ గా విలన్ అయినా రియల్ లైఫ్ లో అనేక మంది భారతీయులకు దైవ సమానుడు అయ్యాడు.
ఇప్పటికీ తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ దైవ సంబంధిత టాపిక్ లోనే కాంట్రవర్సీలోకి ఊహించని విధంగా పడ్డాడు. నేడు మహాశివ రాత్రి పర్వదినం అన్న సంగతి తెలిసిందే. మరి ఈ సుదినాన సోనూ సూద్ పెట్టిన ఓ పోస్ట్ వివాదంగా మారింది. “ఈ మహా శివరాత్రిని ఇతరులకు సహాయం చెయ్యడంతో సెలబ్రేట్ చేసుకోండి కానీ కేవలం ఒక ఫోటోను షేర్ చేసి కాదు ఓం నమః శివాయ” అంటూ ట్వీట్ చేసాడు.
అంతే ఇక్కడ నుంచి మొదలయ్యింది. సోను సూద్ యాంటీ హిందూ అని ఇతర పండుగలకు ఎప్పుడూ ఎందుకు ఇలా చెప్పలేదని నెటిజన్లు అంతా నెగిటివ్ ట్రెండ్ చెయ్యడం మొదలు పెట్టారు. “హూ ది హెల్ ఆర్ యూ సోనూ సూద్” అనే హ్యాష్ ట్యాగ్ తో అతనిపై ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు. దీనితో సోనూ సూద్ ఆలోచన వేరేలా ప్రొజెక్ట్ అయ్యింది.
మళ్ళీ మరేం అనుకున్నాడో ఏమో కానీ తర్వాత తాను కూడా ఓ ఫోటో పెట్టి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాడు. అయినా సరే అతనిపై ఇంకా విమర్శలు ఆగలేదు. మరి అంత మందికి లాక్ డౌన్ సమయంలో కుల, మత భేదాలు లేకుండా కష్టాల్లో ఉన్నవారికి సగటు భారతీయుడిగా అంత సహాయం చేసిన సోనూసూద్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటానని అనుకున్నాడో లేదో.
शिव भगवान की फोटो फॉरवर्ड करके नहीं किसी की मदद करके महाशिवरात्रि मनाएं।
ओम नमः शिवाय ।— sonu sood (@SonuSood) March 11, 2021