విడుదల తేదీ : జూన్ 30,2021
123telugu.com Rating : 2.5/5
నటీనటులు : పృథ్వీరాజ్ సుకుమారన్, అదిథి బాలన్
దర్శకుడు : తను బాలక్
నిర్మాతలు : ఆంటో జోసెఫ్, జోమన్ టి.జాన్, షమీర్ ముహమ్మద్
సంగీతం : ప్రకాశ్ అలెక్స్
సినిమాటోగ్రఫీ : గిరీశ్ గంగాధరన్, జోమన్ టి.జాన్
ఎడిటింగ్ : షమీర్ ముహమ్మద్
ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “కోల్డ్ కేస్”. పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు అదితి బాలన్ నటించిన ఈ మళయాళ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. మరీ ఈ హైబ్రిడ్ జానర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.
కథ:
కొన్ని సంఘటనల అనంతరం ఓ మత్స్యకారుడికి కవర్లో చుట్టిన మనిషి పుర్రె కనిపిస్తుంది. దీనిపై అతడు పోలీసులకు సమాచారం అందిస్తాడు. అయితే స్థానిక ఏసీపీ సత్యజిత్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఈ కేసును స్వీకరించి హత్యకు గల కారణాలు మరియు నేరస్థుడిని పట్టుకోవడానికి తన దర్యాప్తును ప్రారంభిస్తాడు. ఇక మిగిలిన కథ పోలీసు విధానపరమైన దర్యాప్తు మరియు భయంకరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్, అనిల్ మరియు ముగ్గురు, నలుగురు ప్రశంసలు పొందిన మలయాళీ నటులు ఉన్నారు. వారు వారి అద్భుతమైన నటనతో సినిమాను చక్కగా నడిపించారు.
ఈ చిత్రం యొక్క ప్రధాన కథాంశం ఒక మిస్టీరియస్ మర్డర్ మరియు దాని చుట్టూ ఉన్న భయానక అంశంతో వ్యవహరిస్తుంది. అయితే ఆ హత్యపై కొనసాగిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను హర్రర్‌తో మిళితం చేసే ఆలోచన కాస్త కొత్తగా కనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
కోల్డ్ కేస్ డైరెక్టర్ తనూ బాలక్ తన కథనంలో భయానక, నాటకం, సస్పెన్స్ మరియు ఇతర అంశాలను చూపించడానికి తీవ్రంగా ప్రయత్నించి, ప్రధాన కథాంశాన్ని అతి క్లిష్టతరం చేస్తాడు. అయితే కథ మొత్తం ఆశాజనకంగా కనిపిస్తోంది కానీ కొన్ని అనవసరమైన అంశాల కారణంగా కథ టెంపోను గందరగోళానికి గురిచేస్తాయి.
ఇక ఫస్టాఫ్‌లో కొన్ని చమత్కారమైన క్షణాలు కలిగి ఉండగా, తరువాతి భాగంలో పెద్దగా ఆసక్తిగా అనిపించవు. ఇక చివరికి పెద్ద రివీల్ కృత్రిమంగా కనిపిస్తుంది. క్లైమాక్స్‌ను కూడా పెద్దగా రూపొందించలేకపోయారు.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ అగ్రస్థానంలో నిలిచాయని చెప్పాలి. అంతేకాదు అవే సినిమాకు ప్రధానంగా కనిపించాయి. ఇక ఎడిటింగ్ బాగా ఉండేది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు అనవసరంగా విస్తరించబడ్డాయని అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా ఆకట్టుకుంటుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “కోల్డ్ కేస్” సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఆసక్తికరమైన సెటప్ ఉన్నప్పటికీ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యిందని చెప్పాలి. అయితే పృథ్వీరాజ్ మాత్రం చక్కని నటనను కనబరిచాడు. ఇక ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్సుకతని పెంచిన కథలో మాత్రం టెంపో మిస్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్లను కోరుకునేవారు పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమాను చూడవచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team