సమీక్ష : ‘ఇష్క్’ – ఓకే అనిపించే రొమాంటిక్ రివేంజ్ డ్రామా

సమీక్ష : ‘ఇష్క్’ – ఓకే అనిపించే రొమాంటిక్ రివేంజ్ డ్రామా

Published on Jul 31, 2021 3:01 AM IST
Ishq movie review

విడుదల తేదీ : జూలై 30, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌

దర్శకుడు: య‌స్‌.య‌స్‌. రాజు

నిర్మాతలు : ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
సంగీత దర్శకుడు : మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్రఫీ : సాం కె నాయుడు

ఎడిటర్: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌


జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, అదే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా ఎం ఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “ఇష్క్” – నాట్ ఎ లవ్ స్టోరీ. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవుతున్న తొలి చిత్రం కావడం మరియు టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచడంతో మంచి హైప్ నడుమ ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

సిద్ధు (తేజ సజ్జా), అను (ప్రియా ప్రకాష్ వారియర్) ఇద్దరు ప్రేమలో ఉంటారు. అయితే ఈ ప్రేమ జంట ఒక రోజు రాత్రి బయటకు వెళ్లి కారులో రొమాన్స్ చేసుకుంటుంటారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మాధవ్ (రవీంద్ర విజయ్) వారి ఫోటోలను తీసి పోలీస్‌నని బెదిరించి ఆ రాత్రంతా ఆ ప్రేమ జంటను తెగ ఇబ్బంది పెడతాడు. ఆ నెక్స్ట్ డే ఈ ప్రేమ జంట మధ్య ఎలాంటి గొడవ జరిగింది? సిద్ధు మాధవ్‌పై ఏ విధంగా రివేంజ్ తీర్చుకుంటాడు? చివరకు సిద్ధు, అనుల లవ్ స్టోరీ ఏ విధంగా టర్న్ తీసుకుంది? అనేది తెలియాలంటే ఈ సినిమాను స్క్రీన్‌పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్‌ల మధ్య రొమాన్స్ బాగా కుదిరింది. వారి వారి పాత్రల్లో ఇద్దరు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో తేజ సజ్జా రొమాంటిక్ యాంగిల్‌లో, అలాగే సెకండాఫ్‌లో రివేంజ్ తీర్చుకున్న విధానం, అతడి శైలి, నటన బాగా ఆకట్టుకుంది. ఇక రవీంద్ర విజయ్ కూడా శాడిష్ట్ క్యారెక్టరైజేషన్‌లో చక్కటి నటన కనబరిచాడు.

ఇదే కాకుండా తమ జంటకు ఎదురైన సంఘటనను అచ్చు గుద్దినట్టు సిద్ధు(తేజ) రివేంజ్ తీర్చుకోవడం బాగా అనిపించింది. ఎండింగ్‌లో సిద్ధు, అనుల మధ్య వచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా ఫస్టాఫ్ మొత్తం టూ మచ్ బోరింగ్‌గా అనిపించింది. సిద్ధు, అను జంటను మాధవ్ వేధించిన తీరు మరీ లెంతీగా చూపించడం పెద్ద మైనస్ అయ్యిందని చెప్పాలి. ఇక్కడే ప్రేక్షకులు మరీ ఎక్కువ బోరింగ్‌గా ఫీలయ్యారు.

ఇదే కాకుండా సినిమాలో పెద్దగా క్యారెక్టరైజేషన్ కనిపించకపోవడం, కథనాన్ని సరిగ్గా రాసుకోకపోవడం, ఒకే పాయింట్‌ని పట్టుకుని సాగదీతలా చూపించడం పెద్ద డ్రా బ్యాక్ అని చెప్పాలి.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకు నేపధ్య సంగీతం పర్వాలేదనిపించింది, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగానే ఉంది. ఇక దర్శకుడు విషయానికి వస్తే అతడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా అది సరిగ్గా ఎలివేట్ చేసి చూపించడంలో సక్సెస్ కాలేకపోయాడు.

కథపై సరైన గ్రిప్పింగ్ కనబడకపోవడంతో అది ప్రేక్షకులను బాగా అసహనానికి గురిచేసింది. అతను రాసుకున్న కథనానికి మరిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి ఇంకాస్త బెటర్‌గా చూపించి ఉంటే బాగుండు అనిపించింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ‘ఇష్క్’ – నాట్ ఎ లవ్ స్టోరీలో బయట ప్రేమ జంటలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల అల్లర్లు ఏ మేరకు ఉంటాయనేది చూపించే ప్రయత్నం చేసినప్పట్టికి సరైన కథనం లేకపోవడంతో ఒకింత నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఏదేమైనా కాస్త రొమాంటిక్, రివేంజ్ డ్రామాలను కోరుకునే వారికి ఈ సినిమా ఓ ఛాయిస్‌గా నిలుస్తుందని చెప్పాలి.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు