సమీక్ష : నూటొక్క జిల్లాల అందగాడు – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్ టైనర్ !

సమీక్ష : నూటొక్క జిల్లాల అందగాడు – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్ టైనర్ !

Published on Sep 4, 2021 12:55 PM IST
101 Jillala Andagadu Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 03, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అవ‌స‌రాల శ్రీనివాస్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు
దర్శకుడు: రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌
నిర్మాత‌లు: శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
సంగీత దర్శకుడు: శ‌క్తికాంత్ కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: రామ్‌
ఎడిటర్: కిర‌ణ్ గంటి

అవసరాల శ్రీనివాస్ మరియు రుహని శర్మ లు హీరో హీరోయిన్ లుగా కలిసి నటించిన తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. ఈ చిత్రంకి రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు మరియు క్రిష్ జాగర్లమూడి సమర్పణ లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

గుత్తి సూర్యనారాయణ (అవసరాల శ్రీనివాస్)కి బట్టతల. ఆ విషయం ఎవరికి తెలియకుండా మ్యానేజ్ చేస్తుంటాడు. అలాగే విగ్గు లేకుండా ఐదు నిమిషాలు కూడా ఉండలేదు. ఈ క్రమంలో సూర్యనారాయణ పని చేస్తున్న అఫీస్ లో జాయిన్ అవుతుంది అంజలి (రుహాని శర్మ). ఆమెను చూసి ప్రేమలో పడతాడు. తన బట్టతల విషయం దాచి అంజలితో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అంజలికి సూర్యనారాయణ బట్టతల గురించి తెలుస్తోంది. దానికి ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ? చివరకు సూర్యనారాయణ – అంజలి ఒకటి అవుతారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్ర‌స్తుతం ఎందరో జీవితాల్లో ఉన్న సమస్య ఆధారంగా ఈ కథను రాసుకోవడం.. ఆ కథకు చక్కని ట్రీట్మెంట్ తో పాటు కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ స‌న్నివేశాలను తీసిన విధానం బాగుంది. ప్ర‌ధానమైన పాత్ర‌ధారి గుత్తి సూర్యనారాయణ పాత్ర చుట్టూ అల్లిన డ్రామా బాగుంది. హీరోగా అవసరాల శ్రీనివాస్ ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో తన పాత్ర‌లో చాల బాగా న‌టించాడు.

కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాల బాగా ఆకట్టుకుంటుంది.
ఇక అంజలి పాత్ర‌లో నటించిన రుహాని శర్మ తన నటనతో ఆట్టుకుంటుంది. అలాగే మ‌రో ప్ర‌ధాన‌మైన పాత్రలో కనిపించిన రోహిణి త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకరచయితలు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను మాత్రం రాసుకోలేదు. ముఖ్యంగా కథనం విషయంలో దర్శకుడు మెప్పించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేవు.

అసలు బట్టతల అనేది ఎంత పెద్ద సమస్య అయినా కొన్ని సన్నివేశాలు సహజనికి దూరంగా సాగుతాయి. క్లైమాక్స్ కూడా మరో లోపం. క్లైమాక్స్ లోని ఎమోషన్, మిగిలిన పాత్రల తాలూకు సీన్స్ కూడా కొంచెం అసంబద్ధంగా అనిపిస్తాయి, దర్శకరచయితలు స్క్రిప్ట్ పై ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే సినిమా అవుట్ ఫుట్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథనాన్ని రాసుకోలేకపోయారు. పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

బట్టతల బాధితుడిగా వచ్చిన ఈ నూటొక్క జిల్లాల అందగాడు కామెడీగా సాగుతూ అక్కడక్కడా మంచి ఫీల్ తో బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే కీలకమైన ఎమోషన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవడం, అలాగే కథనం కూడా కొన్ని చోట్ల ఇంట్రస్టింగ్ గా సాగకపోవడం, కొన్నిచోట్ల కామెడీ పండకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే అవసరాల శ్రీనివాస్ యాక్టింగ్, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా ఈ కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోదు.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు