ఓటిటి సమీక్ష: 3 రోజెస్ – ఆహా వీడియో లో తెలుగు సిరీస్

ఓటిటి సమీక్ష: 3 రోజెస్ – ఆహా వీడియో లో తెలుగు సిరీస్

Published on Nov 13, 2021 3:02 AM IST
3 Roses Movie Review In Telugu

విడుదల తేదీ : నవంబర్ 12, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఇషాన్, ప్రిన్స్, సంగీత్ శోబన్, వైవా హర్ష, సత్యం రాజేష్
దర్శకత్వం : మ్యాగీ

నిర్మాత: ఎస్ కె ఎన్
సంగీత దర్శకుడు: సన్నీ ఎం ఆర్
సినిమాటోగ్రఫీ: బాలరెడ్డి

ఎడిటింగ్: ఎస్ బి ఉద్దవ్

ఈషా రెబ్బా, పాయల్ రాజ్ పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 3 రోజెస్ వెబ్ సిరీస్ నేడు ఆహా వీడియో లో విడుదల అయ్యింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం రండి.

 

కథ:

ఈ వెబ్ సిరీస్ ముగ్గురు వ్యక్తులకి సంబందించి ఉంది. ఈషా రెబ్బా, పాయల్ రాజ్ పుత్, పూర్ణ లు ఈ సీరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించారు. వీరు ఇంట్లో, పని చేసే దగ్గర ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? పెళ్లిళ్ల పై రిలేషన్ షిప్స్ పై వారి అభిప్రాయాలు ఏంటి? వారు ఎలా కనెక్ట్ అయ్యారు? అనే విషయాలు తెలియాలంటే సీరీస్ ను చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఈ వెబ్ సిరీస్ లో నటించిన మూడు ప్రధాన పాత్రలు అయిన ఈషా రెబ్బా, పాయల్ రాజ్ పుత్, పూర్ణ ల నటన ఆకట్టుకుంటుంది. ఈషా రెబ్బా ఈ సీరీస్ లో చాలా బావుంది. తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. పాయల్ రాజ్ పుత్ ఉన్నంత సేపు ఆకట్టుకుంటుంది. పరిమిత సన్నివేశాల్లో కనిపిస్తుంది. పూర్ణ కి ఈ సీరీస్ లో మంచి పాత్ర వచ్చింది. పాత్ర కి తగ్గట్లుగా నటించింది. ఈ సీరీస్ లో వైవా హర్ష కామెడీ చాలా బాగుంది.

ప్రముఖ దర్శకుడు మారుతి ఈ వెబ్ సిరీస్ కి రైటర్ గా ఉండటం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తన మార్క్ కామెడీ ఈ సీరీస్ లో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సిరీస్ అంతా కూడా ముగ్గురు ప్రధాన పాత్రల చుట్టూ ఉండటం తో సీరీస్ చాలా కొత్తగా, ఫ్రెష్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్:

సీరీస్ కొత్తగా అనిపించినప్పటికీ, ఏం జరుగుతుంది అనేది ముందుగానే అర్దం అవుతుంది. కథనం అంతగా ఆక్టుకోలేకపోయింది. అంతేకాక ప్రేక్షకులు సైతం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఊహించగలరు.

స్త్రీ ల జీవితాల్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఇందులో ప్రధాన అంశం గా ఉన్నప్పటికీ, చాలా రొటీన్ గా చూపించడం జరిగింది. అంతేకాక తమ తల్లిదండ్రులు కూతుళ్లను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే అంశాన్ని మరీ ఎక్కువగా చూపించడం జరిగింది.

 

సాంకేతిక విభాగం:

ఈ సీరీస్ కి మాగి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించడం జరిగింది. కథ బావున్నా, కథనం కొత్తగా లేదు. అక్కడక్కడా సమయానుసారంగా వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. సీరీస్ లో ఉన్న పాట బావుంది. సినిమాటోగ్రఫి బావుంది, ఆహా వీడియో నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్, కథ మరియు చూపించిన విధానం కొత్తగా ఏమీ లేదు. కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ఉంటే ఒక్కసారి చూడవచ్చు. ఇప్పుడు నాలుగు ఎపిసోడ్ లు వీక్షకులకి అందుబాటులో ఉన్నాయి. మిగతా నాలుగు ఎపిసోడ్ లు నవంబర్ 19 వ తేదీన ప్రసారం అవుతాయి.

 

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు