నాగ శౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్ల పూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం లక్ష్య. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ డిసెంబర్ 1 వ తేదిన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మరొక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం డిసెంబర్ 10 వ తేదీన విడుదల అవుతుండటం తో సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.