బాలయ్య అన్ స్టాపబుల్ కి భారీ రెస్పాన్స్…IMDB టాప్ 10 షోస్ లో ప్లేస్!

బాలయ్య అన్ స్టాపబుల్ కి భారీ రెస్పాన్స్…IMDB టాప్ 10 షోస్ లో ప్లేస్!

Published on Jan 6, 2022 2:40 PM IST


నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఆహా వీడియో లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం కి హాజరు అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఫన్ అన్ లిమిటెడ్ తో ఈ కార్యక్రమం తెలుగు నాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

తాజాగా ఈ షో కి IMDB టాప్ 10 లో ఉన్నట్లు తెలుస్తోంది. టాప్ 10 రియాలిటీ టీవీ, టాక్ షో కేటగిరీ లో ఈ అన్ స్టాపబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షో లో ఇంకా ప్రసారం కావాల్సిన ఎపిసొడ్ లు చాలానే ఉన్నాయి. 9.2 రేటింగ్ తో టాప్ 10 లో నిలవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అడుగు వేస్తే ఎక్కడైనా రికార్డు లే అంటూ చెప్పుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు