123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా సాగర్, కళ్యాణి ప్రియదర్శన్, లాలూ అలెక్స్, కనిహా, సౌబిన్ షాహిర్, ఉన్ని ముకుందన్ తదితరులు
దర్శకుడు: పృథ్వీరాజ్ సుకుమారన్
నిర్మాతలు: ఆంటోనీ పెరుంబవూరు
సంగీత దర్శకుడు: దీపక్ దేవ్
సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం
ఎడిటర్: అఖిలేష్ మోహన్
మలయాళ చిత్రం “బ్రో డాడీ” నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం. లూసిఫర్ హిట్ తర్వాత మళ్లీ మోహన్‌లాల్‌కి దర్శకత్వం వహించడం ఆశ్చర్యం కలిగించింది. నేడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
కథ:
జాన్ కట్టడి (మోహన్‌లాల్) మరియు అన్నమ్మ (మీనా సాగర్) పెళ్లయిన 25 ఏళ్ల తర్వాత కూడా సంతోషకరమైన జంట. ఈషో (పృథ్వీరాజ్ సుకుమారన్) బెంగళూరులోని ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేసే వారి ఏకైక కుమారుడు. కురియన్ (లాలు అలెక్స్) జాన్ కట్టడికి కుటుంబ స్నేహితుడు మరియు అన్న (కళ్యాణి ప్రియదర్శన్) అతని కుమార్తె, ఆమె కూడా బెంగళూరులో పని చేస్తుంది. ఆమె ఈషోతో లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ఉంది మరియు దాని గురించి వారి ఇద్దరి కుటుంబాలకు తెలియదు. అకస్మాత్తుగా వారి జీవితాలను మార్చే సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య ఏమిటి? పరిష్కారం కోసం వారు తమ కుటుంబాలను ఎలా సంప్రదించారు? తరువాత ఏం జరిగింది? సమాధానాలు తెలుసుకోవాలంటే “బ్రో డాడీ” సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
మోహన్‌లాల్ గురించి మాట్లాడుకుంటే అతని నటన ఎంతో అద్భుతంగా అనిపించింది. చాలా సులువుగా తన పాత్రను పోషించాడు. అతని కామెడీ టైమింగ్ మరియు కొంటె చర్యలు మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాయి. అంతేకాదు అయోమయ కొడుకుగా పృథ్వీరాజ్ కూడా చాలా బాగా నటించాడు. లాలూ అలెక్స్ తన క్యారెక్టర్‌లో ఇంకా అమాయకమైన తండ్రిగా జీవించాడు. కళ్యాణి ప్రియదర్శన్ పాత్రకు చక్కగా సరిపోయింది మరియు ఆమె తన అత్యుత్తమ నటనను కూడా అందించింది. మీనా, కనిహా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సీరియస్ ఇష్యూని హాస్యాస్పదంగా చెప్పడంలో పృథ్వీరాజ్ సక్సెస్ అయ్యాడు. కామెడీ, ఎమోషన్స్ రెండింటినీ చక్కగా హ్యాండిల్ చేశాడు. మీ కళ్ళు తెరపైకి అతుక్కుపోయేలా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి మరియు సన్నివేశాలను మరింత హాస్యభరితంగా మార్చేంత సంగీతం బాగుంది. లీడ్ పెయిర్ మరియు మేల్ లీడ్స్ మధ్య సిట్యుయేషనల్ కామెడీ బ్రో డాడీని చూడదగినదిగా చేసింది.
మైనస్ పాయింట్స్:
ఈ కథనం ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కానీ దర్శకుడు హాస్యభరితంగా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్‌లో కథనం రసవత్తరమైన స్క్రీన్‌ప్లేతో నడిచినా చివరి భాగంలో డల్‌గా మారి సినిమా క్లైమాక్స్‌కు చేరుకోవడంతో మళ్లీ వేగం పెంచింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కాస్త నిడివితో ఉన్నాయి. ఉన్ని ముకుందన్ మరియు సౌబిన్ షహర్‌లకు సంబంధించిన సన్నివేశాలు ప్రధాన కథకు కాస్త అడ్డంకులుగా అనిపించాయి.
సాంకేతిక విభాగం:
నిర్మాత ఆంటోని పెరుంబావూర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ అభినందన్ రామానుజం స్క్రీన్‌పై మరియు అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన దృశ్యాలను అందించాడు. దీపక్ దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని మూడ్‌ని ప్రేక్షకులు పసిగట్టడంలో కీలక పాత్ర పోషించింది. అఖిలేష్ మోహన్ ఎడిటింగ్ రెండవ భాగంలో క్రిస్పీగా అనిపించింది. చివరగా పృథ్వీరాజ్ దర్శకత్వం గురించి మాట్లాడుకుంటే బాగా తెలిసిన కథను చక్కగా నిర్వహించాడు. కామెడీ, ఎమోషన్స్ రెండింటినీ చక్కగా హ్యాండిల్ చేశాడు.
తీర్పు:
మొత్తంగా చూసుకున్నట్టైతే “బ్రో డాడీ” అనేది స్టార్-స్టడెడ్ ఫ్యామిలీ డ్రామా. ఒక తీవ్రమైన సమస్యను ఫన్నీగా డీల్ చేసి ఎమోషనల్ నోట్‌లో ముగించబడుతుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలను మినహాయించి సిట్యుయేషనల్ కామెడీని బాగా హ్యాండిల్ చేసారు. మోహన్‌లాల్ మరియు పృథ్వీరాజ్‌లు కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలు ఇస్తూ “బ్రో డాడీని” ఇంట్లోనే టైమ్ పాస్ వాచ్‌గా మార్చారు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For English Version