విడుదల తేదీ : ఫిబ్రవరి 25, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: మాధురీ దీక్షిత్, సంజయ్ కపూర్, మానవ్ కౌల్, రాజ్ శ్రీ దేశ్ పాండే
దర్శకత్వం : బిజోయ్ నంబియార్ మరియు కరిష్మా కోహ్లీ
నిర్మాత: కరణ్ జోహార్, సోమెన్ మిశ్రా
ఎడిటర్ : మోనిషా ఆర్. బల్దావా
బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ కోసం పరిచయం అక్కర్లేదు. వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించి మొట్ట మొదటిసారిగా ఓటిటి లో డెబ్యూ ని ఈ సిరీస్ “ది ఫేమ్ గేమ్” తో ఇచ్చారు. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక ఈ సిరీస్ స్టోరీ లైన్ లోకి వస్తే.. అనామిక ఆనంద్(మాధురి దీక్షిత్) బాలీవుడ్ లో మంచి ఫేమస్ అయ్యిన నటి కానీ క్రమక్రమంగా అలా తన ఫేమ్ ని పోగొట్టుకుంటుండడంతో ఆమె నిరాశకి లోనవుతుంది. అయితే ఓ రోజు ఒక భారీ అవార్డు ఫంక్షన్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె ఊహించని రీతిలో మిస్సయ్యిపోతుంది. ఇక ఇక్కడ నుంచి ఈమె ఎలా మిస్సయ్యింది? ఎక్కడుంది అనేవి కనుక్కోడానికి ఓ ఏసీపీ శోభా త్రివేది(రాజ్ శ్రీ దేశ్ పాండే) ని నియమిస్తారు. మరి ఈమె ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది? అనామిక జీవితంలో ఆమె ఈ ఆఫీసర్ కనుక్కున్న కొత్త కోణాలు ఏమిటి అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సిరీస్ లో ఎలాంటి సందేహం లేకుండా బిగ్గెస్ట్ ప్లస్ గా మాధురి దీక్షిత్ కోసం మాట్లాడుకోవాలి. తాను తన మొదటి ఓటిటి డెబ్యూ లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. ముఖ్యంగా తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పలు సీన్స్ లో ఆ తాలూకా భావాలను అద్భుతంగా పండించారని చెప్పాలి. అంతే కాకుండా ఈ వయసులో కూడా ఈ సినిమాలో తన లుక్స్ తో ఆకట్టుకున్నారు.
ఇక అలాగే మరో కీలక పాత్రలో నటించిన సంజయ్ కపూర్ ఈ సిరీస్ తో తన కెరీర్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ రోల్ చేసారని చెప్పాలి. ఈ సిరీస్ లో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతకు అనుగుణంగా మంచి నటనను కనబరిచారు. అలాగే పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రాజ్ శ్రీ దేశ్ పాండే కూడా మంచి నటనని అందించారు. ఇంకా మనవి కౌల్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. ఇంకా ఈ సిరీస్ లో రెండు ఎపిసోడ్స్ అయితే మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సిరీస్ లో వీక్షకులకు కాస్త విసుగు తెప్పించే అంశం ఏమిటంటే కనిపించే ప్రతి పాత్రకి కూడా ఆల్ మోస్ట్ ఒక బ్యాక్ స్టోరీ చూపించడం అని చెప్పాలి. ఇలా అందరికీ ఒక్కోటి చూపించడం ఒకింత విసుగు తెప్పించే అంశంలా అనిపిస్తుంది. పోనీ వాటిలో ఏమన్నా కొత్తదనం ఉన్నాయా అంటే ఏది లేదు.. దీనితో కాస్త స్లో గా ఉండే నరేషన్ తో ఎపిసోడ్స్ మరింత పెద్దవిగా ఉన్నట్టు అనిపిస్తాయి.
ఇంకా మాధురి పాత్రను పక్కన పెడితే అసలు ఈ సిరీస్ లో సరైన ఎమోషన్స్ కనిపించవు చాలా మేర ఎపిసోడ్స్ అనవసరంగా పక్క దారి పట్టించినట్టు అనిపిస్తుంది. దీనితో చాలా మేర ఈ సిరీస్ అంత ఎంగేజింగ్ గా అనిపించదు.
సాంకేతిక వర్గం :
ఈ సిరీస్ లో టెక్నికల్ టీం వర్క్ బాగుంది సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వర్క్స్ ఇంప్రెస్ చేస్తాయి, అలాగే డైలాగ్స్ కూడా బావున్నాయి. నిర్మాణ విలువలు అయితే మరింత ఉన్నత స్థాయిలో ఉన్నాయని చెప్పాలి.
ఇక దర్శకులు బిజోయ్ నంబియార్ కరిష్మా కోహ్లీ విషయానికి వస్తే వీరు తీసుకున్న బ్యాక్ డ్రాప్ నిజంగా చాలా బాగుంది. కొంతవరకు అంటే కేవలం మాధురి పాత్ర కనిపించినంతవరకు వారి డైరెక్షన్ బాగానే ఉంది కానీ ఇతర పాత్రలు వాటికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్స్ లాంటివి మాత్రం ఏమంత మెప్పించవు. వీటిలో ఏమన్నా ఆకట్టుకునే అంశాలు జోడించి ఉంటే బాగుండేది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సిరీస్ “ఫేమ్ గేమ్” తో తన పాత్ర వరకు మాత్రం ఓ బలమైన రోల్ తో మాధురి దీక్షిత్ మంచి ఎంట్రీ ఇచ్చారని చెప్పొచ్చు. అయితే ఈ సిరీస్ లో స్ట్రిక్ట్ గా ఆమెపై కనిపించే కొన్ని కీలక సన్నివేశాలు మినహాయిస్తే చెప్పుకోడానికి ఇంప్రెస్ చేసే అంశాలు అంతగా లేవు. మరి ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మాధురి కోసం చూడగలిగితే చూడొచ్చు. లేదా ఈ సిరీస్ ని మీ వాచ్ లిస్ట్ నుంచ స్కిప్ చేసేయొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team
Click Here For English Version