బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?

బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?

Published on Mar 8, 2022 2:30 AM IST


బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్ కార్యక్రమం మొదలై వారం రోజులు పూర్తయ్యింది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. నిజానికి మొదటి వారం మిత్రాశర్మ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు, కానీ ఊహించని విధంగా ముమైత్ ఖాన్ హౌస్ నుంచి బయటకి వచ్చింది. ఇదిలా ఉంటే సోమవారం నాటి ఎపిసోడ్‌లో రెండో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియని బిగ్‌బాస్ షురూ చేశాడు.

అయితే వారియర్స్ టీమ్ సభ్యులు.. ఛాలెంజర్స్ టీమ్ సభ్యులను, ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్ టీమ్ సభ్యులను నామినేట్ చేయాలి. ఈ నేపధ్యంలో హౌస్‌మేట్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరకి మొత్తంగా ఈ వారం సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టాలు హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. చూడాలి మరీ రెండో వారం హౌస్ నుంచి వీరిలో ఎవరు బయటికొస్తారనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు