బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ముమైత్ ఖాన్ వారానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే?

బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ముమైత్ ఖాన్ వారానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే?

Published on Mar 9, 2022 10:00 PM IST


బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్ కార్యక్రమం ప్రస్తుతం రెండో వారం కొనసాగుతుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ బిగ్‌బాస్ తొలి సీజన్ కంటెస్టెంట్‌గా పాల్గొన్న ముమైత్ ఈ ఓటీటీ బిగ్‌బాస్‌లో వారియర్స్ టీమ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా తొలి వారమే బయటకి వచ్చేసింది.

అయితే ఈ ఒక్క వారానికి గాను బిగ్‌బాస్ నిర్వాహకులు ముమైత్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారన్నది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ముమైత్‌కి ఈ ఒక్క వారానికి లక్ష రూపాయల లోపే రెమ్యునరేషన్ ఇచ్చారని, బయట వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆమెకి రూ.80 వేలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రెండో వారం సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టాలు నామినేట్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు