ఓటీటీ రివ్యూ : జల్సా – హిందీ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

ఓటీటీ రివ్యూ : జల్సా – హిందీ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

Published on Mar 22, 2022 3:04 AM IST

విడుదల తేదీ : మార్చ్ 18, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: విద్యాబాలన్, షెఫాలీ షా, రోహిణి హట్టంగడి, సోఫియా ఖాన్, గుర్పాల్ సింగ్ తదితరులు

దర్శకత్వం : సురేష్ త్రివేణి

నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, సురేష్ త్రివేణి

సంగీత దర్శకుడు: గౌరవ్ చటర్జీ

సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి

ఎడిటర్ : శివకుమార్ V. పనికర్

విద్యాబాలన్ జల్సా మరో సినిమాతో మళ్లీ వచ్చింది ఈ చిత్రంలో షెఫాలీ షా కూడా కీలక పాత్రలో నటించింది. మరి సైకలాజికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్’లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

మాయా మీనన్ (విద్యా బాలన్) ఆన్‌ లైన్ మీడియాలో ఒక టాప్ న్యూస్ యాంకర్ గా ఉంటుంది. అయితే, ఆమె ఓ న్యాయమూర్తిని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ అతని పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. దాంతో ఆమె ప్రశ్నలకు ఇబ్బందుల్లో పడతాడు ఆ న్యాయమూర్తి. ఫలితంగా న్యాయమూర్తి ఇంటర్వ్యూ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌ అవుతుంది. అలాంటి బలమైన యాంకర్ మాయా మీనన్ అలియా (కషిష్ రిజ్వాన్) అనే అమ్మాయిని కారుతో ఢీకొట్టుతుంది. ఈ ప్రమాదంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అలియాని అలాగే వదలేసి వెళ్ళిపోతుంది. మరి ఆ తరువాత ఏమి జరిగింది ? ఆ యాక్సిడెంట్ తో మాయా మీనన్ జీవితంలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ జల్సా చిత్రం అద్భుతమైన నటీనటుల అద్భుత ప్రదర్శనలతో నిండిపోయింది. విద్యాబాలన్ తన నటనతో ఈ చిత్రాన్ని లీడ్ చేస్తూ అద్భుతంగా నటించింది. అటు టెన్షన్‌ ను, ఇటు సెటిల్డ్ ఎక్స్ ప్రెషన్స్ ను విద్యా బాల్నా చాలా బాగా చూపించింది. అలాగే జల్సా సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన షెఫాలీ షా కూడా చాలా బాగా నటించింది. ఆమె విద్యా బాలన్ ఇద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి నటించారు.

ముఖ్యంగా యాక్సిడెంట్‌కు ముందు విద్యా బాలన్ బాడీ లాంగ్వేజ్, ఆ తర్వాత చోటు పరిస్థితులకు తగ్గట్టు మారిపోయిన ఆమె నటన చాలా బాగుంది. అయితే, కూతురు యాక్సిడెంట్ గురైన తర్వాత షెఫాలీ షా చేసిన ఫెర్ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉంది. సీనియర్ నటి రొహిణి హట్టంగడి కూడా చాలా బాగా నటించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు.

 

మైనస్ పాయింట్లు:

 

సినిమాలో అంత హెవీ డ్రామా సృష్టించిన తర్వాత ఆ గ్రాఫ్ ను అలాగే కంటిన్యూ చేయడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. అలాగే ప్రేక్షకులను నిరాశపరిచే విధంగా సినిమాను సాధారణ ఎండింగ్ తో ముగించాడు. అలాగే, పోలీసులు ఈ కేసును నిర్వహించే విధానం కూడా అంత గొప్పగా ఏమి లేదు.

అన్నిటికీ మించి ఈ సినిమా బాగా స్లోగా సాగుతుంది. కాకపోతే, సినిమా మెయిన్ కథాంశం బాగున్నా.. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి రొటీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా ఇన్ వాల్వ్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.

 

సాంకేతిక అంశాలు:

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే.. సినిమాని విజువల్ గా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. కెమెరా వర్క్ ముంబైని కొత్త కోణంలో చూపించారు. సంగీతం బాగుంది. సినిమాలో నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

 

తీర్పు:

 

మొత్తమ్మీద ఈ ‘జల్సా’ చిత్రం ఒక సైకలాజికల్ డ్రామా. ఆసక్తికరమైన కథాంశంతో మరియు కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ ప్లేతో ఈ సినిమా ఆసక్తిగా సాగుతుంది. అయితే క్లైమాక్స్‌ ను హడావుడిగా ముగిస్తూ సరైన ఎండింగ్ ఇవ్వలేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. కాకపోతే జల్సాలోని కొన్ని అంశాలు చాలా బాగున్నాయి. వాటిని ఆస్వాదించవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు