సీక్రెట్‌గా ఆది-నిక్కీల నిశ్చితార్ధం.. ఫోటోలు వైరల్..!

సీక్రెట్‌గా ఆది-నిక్కీల నిశ్చితార్ధం.. ఫోటోలు వైరల్..!

Published on Mar 26, 2022 8:01 PM IST

యంగ్‌ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారని గత కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఈ జంట ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని కనిపించింది. అంతేకాదు తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటిస్తూ తమ నిశ్చితార్థం ఫోటోలను నిక్కీ గల్రానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

మేము కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలో పడ్డాము. 2022 మార్చి 24న మా ఇద్దరి నిశ్చితార్ధం జరిగింది.. ఈ రోజు మా ఇద్దరికి ఎంతో స్పెషల్‌. కుటుంభ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. ఈ మా కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలని నిక్కీ పేర్కొంది.

ఇకపోతే 2015 లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ గల్రానీ నటించింది. ఈ చిత్రం తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలయ్యిందని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని తెలుస్తుంది.

ఇక ‘గుండెల్లో గోదారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆది పినిశెట్టి.. “సరైనోడు”,”నిన్ను కోరి”, “రంగస్థలం”, “నీవెవరో”, “యూటర్న్”, “గుడ్‌ లక్‌ సఖి” వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ‘క్లాప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం రామ్ పోతినేని “ది వారియర్” సినిమాలో ఆది విలన్‌గా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు