30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు కీలక పాత్రల్లో శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “కొత్త రంగుల ప్రపంచం”. కాగా ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్ ను మీడియా సమక్షంలో రివీల్ చేయాలని చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి మాట్లాడుతూ.. ‘కొత్త రంగుల ప్రపంచం” సినిమా చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. ఈ సినిమా 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇలాంటి మంచి సినిమాలో నేను దర్శకుడి పాత్రలో నటిస్తున్నాను. ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు.
నటుడు సీనియర్ నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్లకు నష్టం రాకుండా చక్కటి సినిమా తీయాలని పృద్వి గారు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. ఈ చిత్ర నిర్మాతలు మంచి కాన్సెప్ట్ ఉన్న సెంటిమెంట్ కథను సెలెక్ట్ చేసుకొని ఓ మంచి సినిమా తీయాలని కంకణం కట్టుకున్నారు.వారికి ఈ సినిమా గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ తెలియజేస్తూ సస్పెన్స్ త్రిల్లర్ గా సాగె చిత్ర మిది. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.సీనియర్ నటులు వున్నా కూడా వారంతా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. నిర్మాతలు మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఖర్చుకు వెనుకాడకుండా తీసిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.