బాలయ్య “అన్ స్టాపబుల్” సీజన్ 2కి మొదలైన కసరత్తులు..!

బాలయ్య “అన్ స్టాపబుల్” సీజన్ 2కి మొదలైన కసరత్తులు..!

Published on Apr 29, 2022 1:00 AM IST

నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా బాలయ్య తనదైన మ్యానరిజంతో విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ షో తొలి సీజన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ షో రెండో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ టాక్ షో రెండో సీజన్‌కి సంబంధించి సన్నాహాలను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ సారి సీజన్‌కి రాబోయే గెస్ట్ లను కూడా ఫైనల్ చేసే పనిలో పడ్డారట నిర్వాహకులు. ఈసారి గెస్ట్ లుగా చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, తదితరులు గెస్ట్ లుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ సారి మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఈ టాక్ షో ను నడపాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు