‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on May 2, 2022 3:41 PM IST

గత వారం ‘ఆచార్య’ రిలీజ్ అయ్యింది. పైగా ‘ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2’ వంటి భారీ సినిమాలు ఇంకా థియేటర్స్ లోనే ఉన్నాయి. అయినా, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మాత్రం రిలీజ్ లు ఆగడం లేదు. పలు చిన్న సినిమాలతో పాటు ఆల్ రెడీ థియేటర్లలో రిలీజైన పలు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి.

ఇక ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఈ వారం అమెజాన్‌ ప్రేమ్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ సిరీస్ :

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(కన్నడ)- మే5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద వైల్డ్‌(వెబ్‌సిరీస్‌2)- మే6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ సిరీస్ :

రాధేశ్యామ్‌(హిందీ)-మే4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

థార్‌(మిందీ)-మే6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

40 ఇయర్స్‌ యంగ్‌(హాలీవుడ్‌)-మే4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌(వెబ్‌సిరీస్‌)-మే6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ లు :

హోమ్‌ శాంతి(హిందీ సిరీస్‌)-మే6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్టోరీస్‌ ఆన్‌ది నెక్ట్స్‌ పేజ్‌(హిందీ సిరీస్‌)-మే6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ5లో ప్రసారం అవుతున్న సినిమా :

ఝండ్‌(హిందీ)-మే6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు