మెగాస్టార్ “ఆచార్య” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్?

మెగాస్టార్ “ఆచార్య” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్?

Published on May 3, 2022 1:44 AM IST


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా మూడు రోజుల క్రితం విడుదలై థియేటర్లలో రన్ అవుతోంది. అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిమానులను, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఊహించిన దానికంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలో కి రానున్నట్లు తెలుస్తోంది.

బజ్ నిజమైతే, మల్టీస్టారర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, అజయ్, శత్రు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు