“9 అవర్స్” వెబ్ సిరీస్ కి షో రన్నర్ గా డైరెక్టర్ క్రిష్!

“9 అవర్స్” వెబ్ సిరీస్ కి షో రన్నర్ గా డైరెక్టర్ క్రిష్!

Published on May 12, 2022 11:27 AM IST

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. 9 అవర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సీరీస్ ను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహిస్తున్నారు.

పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న వాళ్లు బ్యాంక్ లోకి ఎలా చొర బడ్డారు, అక్కడ వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయ్యిందా, ఇంతలో పోలీస్ తీసుకున్న చర్యలేంటి అనేది ఈ వెబ్ సిరీస్ లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు