కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తదుపరి చిత్రం విక్రాంత్ రోణ. అంతకు ముందు నటుడి మరో సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విడుదలవుతోంది. నవంబర్ 2021 లో విడుదలైన కిచ్చా సుదీప్ యొక్క కోటిగొబ్బ 3 ఇప్పుడు తెలుగులో K3 కోటికొక్కడు పేరుతో జూన్ 17, 2022 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది.
ఈ సినిమాలో కిచ్చా సుదీప్ ద్విపాత్రాభినయం చేశాడు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్, రవిశంకర్, నవాబ్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు లో విడుదల అవుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.