స్ట్రీమింగ్ కి వచ్చేసిన శివ కార్తికేయన్ “డాన్”

స్ట్రీమింగ్ కి వచ్చేసిన శివ కార్తికేయన్ “డాన్”

Published on Jun 10, 2022 12:00 PM IST


శివ కార్తికేయన్ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ డాన్. లైకా ప్రొడక్షన్స్ మరియు శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యింది.

ఈ చిత్రం నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది. తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా, ఎస్. జే సూర్య, సముద్ర ఖని, సూరి లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు