మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు వెర్సటైల్ నటుల్లో కోలీవుడ్ స్టార్ నటుడు మాధవన్ కూడా ఒకరు. అయితే నటుడుగా తెలుగు సహా తమిళ్ లో పలు సినిమాలతో ఆకట్టుకున్న మాధవన్ తన డ్రీం ప్రాజెక్ట్ గా చేసిన లేటెస్ట్ చిత్రమే “రాకెట్రి – ది నంబియార్ ఎఫెక్ట్”.
కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మాధవన్ నే స్వీయ దర్శకత్వం మరియు నిర్మాణం వహించి ప్రధాన పాత్రధారునిగా నటించారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి రావడానికి సిద్ధం అయ్యింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని ఈ జూలై 26 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నట్టు తెలిపారు. మరి తమిళ్ సహా తెలుగు హిందీ మినహా ఇతర దక్షిణాది భాషల్లో ఈ చిత్రం అయితే స్ట్రీమ్ కానుంది. మరి ముందు మిస్ అయ్యిన వారు అయితే ఈసారి చూడొచ్చు.
hop on for a space adventure ????#RocketryOnPrime, July 26 pic.twitter.com/W3JDZEz2eD
— prime video IN (@PrimeVideoIN) July 20, 2022