విడుదల తేదీ : ఆగస్టు 19, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి, సంజయ్ రాయ్ మరియు ఇతరులు
దర్శకత్వం : సుకు పూర్వజ్
నిర్మాతలు: వాసుదేవ్ రాజపంతుల, ప్రభాకర్ డి
సంగీత దర్శకుడు: అషీర్ ల్యూక్
సినిమాటోగ్రఫీ: శివరామ్ చరణ్
ఎడిటర్: శివ సర్వాణి
లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ అలాగే శ్రీహరి ఉదయగిరి తదితరులు నటించిన చిత్రం “మాట రాని మౌనమిది” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. రామ్(మహేష్ దత్త) అలాగే ఈశ్వర్(సంజయ్ రాయి) లు ఇద్దరూ కూడా బావ బావమరుదులు కాగా వారిలో ఈశ్వర్, రామ్ సోదరిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఓ రోజు రామ్, ఈశ్వర్ ఇంటికి ఓ పని మీద రాగా అక్కడ అతడికి ఓ ఉంగరం దొరుకుతుంది. దాన్ని తీసుకున్నాక దానితో కొన్ని శక్తులు ఉన్నట్టుగా రామ్ తెలుసుకుంటాడు. మరి ఈ క్రమంలో ఈశ్వర్ కి కూడా ఈ విషయం తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తారు? ఈ తర్వాత రామ్ కి ఎదురైనా అవాంతరాలు ఏమిటి వీటికి హీరోయిన్ సీత(సోనీ శ్రీవాస్తవ)కి ఏమన్నా లింక్ ఉంటుందా? ఇంతకీ ఆ ఉంగరం వెనక ఉన్న స్టోరీ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ తరహా కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపుతాయి. మరి వాటికి తగ్గట్టుగానే సినిమాలో లైన్ సహా నరేషన్ స్టార్టింగ్ నుంచి బాగానే కనిపిస్తుంది. అలాగే సినిమాలో రివీల్ అయ్యే ట్విస్ట్ ఇంటర్వల్ వరకు కొనసాగే సస్పెన్స్ కూడా చాలా ఆసక్తిగా కొనసాగుతుంది.
ఇక నటీనటుల్లో అయితే మహేష్ దత్త డీసెంట్ నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే సోని శ్రీవాస్తవ ఇతర నటీనటులు కూడా తమ పాత్రల్లో మంచి పెర్ఫామెన్స్ తో మెప్పిస్తారు. మరి మరో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది శ్రీహరి ఉదయగిరి అని చెప్పుకోవాలి. తాను స్టన్నింగ్ పెరఫామెన్స్ ని అయితే కనబరిచాడు. ఇక అలాగే సినిమాలో సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ సహా పలు చోట్ల కామెడీ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మంచి లైన్ కనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల బాగానే అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా మాత్రం కథనం అంత ఆకట్టుకునే రేంజ్ లో ఉన్నట్టు అనిపించదు. మరీ ఆంధ్ ఎగ్జైటింగ్ గా అనిపించకుండా సో సో గానే నరేషన్ డల్ గా సాగినట్టు అనిపిస్తుంది. మరి అలాగే సినిమాని కూడా అనవసరంగా కొన్ని సీన్స్ తో బాగా సాగదీసినట్టుగా కూడా అనిపించక మానదు.
అలాగే అనేక సన్నివేశాలకు సంబంధించి అయితే వాటిని మధ్యలోనే వదిలేసినట్టు అనిపిస్తుంది. దీనితో చూసే ఆడియెన్స్ కి ఆ సీన్స్ కంప్లీట్ అవ్వని భావనతోనే ఉండిపోతారు. ఇక అలాగే మరో మేజర్ మైనస్ పాయింట్ ఏమిటంటే ఈ చిత్రంలో పాటలని చెప్పాలి. సినిమాలో ఉన్న ఏ పాట కూడా ఆన్ స్క్రీన్ వర్కౌట్ కాలేదు.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ టీం లోకి వస్తే అశీర్ ల్యూక్ ఇచ్చిన సంగీతం బ్యాక్గ్రౌండ్ లో బాగుంది. పాటలైతే మాత్రం మెప్పించవు, కానీ సీన్స్ కి తగ్గట్టుగా ఇచ్చిన స్కోర్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో చాలా వరకు సీన్స్ తగ్గించి ఉండాల్సింది.
ఇక దర్శకుడు సుకు పూర్వజ్ విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న కాన్సెప్ట్ కి మాత్రం మెచ్చుకొని తీరాలి. ఈ తరహా కాన్సెప్ట్ మంచి ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. కానీ తాను అయితే పూర్తి స్థాయిలో ఈ ఎగ్జైట్మెంట్ ని నిలిపి ఉంచడంలో మాత్రం విజయం అందుకోలేదు. కొన్ని కొన్ని చోట్ల పర్వాలేదు కానీ ఓవరాల్ గా అయితే డిజప్పాయింట్ చేసాడని చెప్పక తప్పదు. ఇంకా బెటర్ నరేషన్ ని తాను రాసుకొని ఉంటే బాగుండేది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మాట రాని మౌనమిది” చిత్రంలో నటీనటుల డీసెంట్ పెర్ఫామెన్స్ లు అలాగే సినిమాలో కనిపించే లైన్ సహా పలు అంశాలు త్రి చేస్తాయి కానీ కథనం మెప్పించే విధంగా ఓవరాల్ గా నడపకపోవడం అనేది సినిమా ఫలితాన్ని దెబ్బ తీస్తుంది. దీనితో అయితే ఈ చిత్రం మాత్రం ఒక బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోతుంది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team