హాట్ స్టార్ తో గీతా ఆర్ట్స్ “మహా భారతం” బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.!

హాట్ స్టార్ తో గీతా ఆర్ట్స్ “మహా భారతం” బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.!

Published on Sep 10, 2022 3:34 PM IST

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్స్ గీతా ఆర్ట్స్ కూడా ఒకటి. దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఈ బ్యానర్ నుంచి టాలీవుడ్ లో ఎన్ని యూనిక్ చిత్రాలు వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యాయి. మరి ఇదిలా ఉండగా ఈ బడా బ్యానర్ నుంచి ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ తో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని అయితే లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.

గత కొన్నాళ్ళకి ముందు మహాభారతం సినిమాలా ప్లాన్ చేస్తారని తెలిసింది. కానీ ఇప్పుడు అయితే దీనిని భారీ విజువల్స్ కలిగిన వెబ్ సిరీస్ లా ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిని అయితే హాట్ స్టార్ తో కలిసి నెవర్ బిఫోర్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నామని గీతా ఆర్ట్స్ వారు తెలుపుతున్నారు. అంతే కాకుండా దీనిపై రిలీజ్ చేసిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్ లాంటి పోస్టర్ లు కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని డీటెయిల్స్ ముందు రోజుల్లో రానున్నాయి.

https://twitter.com/GeethaArts/status/1568509224753442816?s=20&t=X9Ht0TDYifrg9PoRWI1PwA

సంబంధిత సమాచారం

తాజా వార్తలు