సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన “అం అః”

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన “అం అః”

Published on Sep 15, 2022 6:22 PM IST


ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్ల కు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణం లోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అం అః. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథతో డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ప్రయోగం చేస్తున్నారు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ అం అః చిత్రానికి ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ కుమార్ కంగుల‌ సంగీతం అందిస్తున్నారు.

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చిత్ర ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జోరిగె శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, “తమ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమాను చూసిన సెన్సాన్ బోర్డు సభ్యులు అప్రిషియేట్ చేయడంతో, సినిమాపై నమ్మకం మరింతగా పెరిగింది. రేపే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్గాలకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో నటీనటులు కొత్తవాళ్లైనప్పటికీ, చాలా బాగా చేశారు. ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది” అని అన్నారు.

సస్పెన్స్‌కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16 న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య‌, సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు శ్యామ్ మండ‌ల‌, నిర్మాత‌ జోరిగె శ్రీనివాస్ రావు, బ్యాన‌ర్స్‌ రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్, కో ప్రొడ్యూస‌ర్‌ అవినాష్ ఎ.జ‌గ్త‌ప్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌ ప‌ళ‌ని స్వామి, సినిమాటోగ్రాఫ‌ర్‌ శివా రెడ్డి సావ‌నం, మ్యూజిక్‌ సందీప్ కుమార్ కంగుల‌, ఎడిటర్ జె.పి, పిఆర్ఓ సాయి సతీశ్, పర్వతనేని రాంబాబు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు