ఓటిటి : హాట్ స్టార్ యూజర్లకు ఇక నుంచి అదిరే ఎక్స్ పీరియెన్స్.!

ఓటిటి : హాట్ స్టార్ యూజర్లకు ఇక నుంచి అదిరే ఎక్స్ పీరియెన్స్.!

Published on Sep 17, 2022 2:06 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఓటిటిలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ దక్కుతుందో తెలిసిందే. అలా ఎన్నో పాపులర్ ప్లాట్ ఫామ్ లు తమ యూజర్లకు ఎప్పటికప్పుడు బెటర్ ఎక్స్ పీరియన్స్ ని అందించే పనిలో ఉంటున్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు దిగ్గజ ఓటిటి సంస్థల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఒకటి.

మరి మన దేశంలో కూడా భారీ సంఖ్యలో యూజర్స్ ఉన్న ఈ సంస్థ వారు లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించారు. ప్రస్తుతం ఉన్న సౌండ్ టెక్నాలజీస్ లో “డాల్బీ అట్మాస్” కోసం చాలా మందికి తెలిసే ఉండొచ్చు. మరి వారితో హాట్ స్టార్ వారు టై అప్ కాగా ఇక నుంచి హాట్ స్టార్ లో కంటెంట్ డాల్బీ అట్మాస్ సౌండ్ ఎక్స్ పీరియెన్స్ తో అందుబాటులోకి ఉంటుంది అని తెలిపారు. దీనితో ఈ సరికొత్త అప్డేట్ అయితే ఓటిటి వర్గాల్లో మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు