లేటెస్ట్..”లైగర్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసిందా.?

లేటెస్ట్..”లైగర్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసిందా.?

Published on Sep 20, 2022 11:08 PM IST


మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న అంచనాలు అయితే అందుకోలేకపోయింది. దీనితో బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా లెవెల్లో ప్లాప్ గానే మిగిలిన ఈ చిత్రం విషయంలో విజయ్ దేవరకొండ ఎఫర్ట్స్ కి మాత్రం మంచి ఫీడ్ బ్యాక్ దక్కింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై అయితే ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమ్ కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది తెలుగు సహా ఎన్ని భాషల్లో వస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ, మైక్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు