గత ప్యాండమిక్ టైం లో తెలుగు సినిమా దగ్గర వచ్చి మంచి హిట్స్ గా నిలిచినటువంటి చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” అలాగే తర్వాత ఏడాది అలాంటి కరోనా పరిస్థితిలోనే వచ్చిన అక్కినేని వారి క్రేజీ మల్టీ స్టారర్ “బంగార్రాజు” కూడా థియేటర్లు లో రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి.
ఇక ఈ రెండు సినిమాల తాలూకా శాటిలైట్ హక్కులు అయితే ప్రముఖ ఛానెల్ జీ తెలుగు వారు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ రెండు చిత్రాలకు గాను కొన్ని క్యాటగిరీస్ లో తమ ఛానెల్ కి అవార్డ్స్ వచ్చినట్టుగా వారు తెలిపి సంతోషం వ్యక్తం చేశారు.
ఇండియన్ మార్కెటింగ్ సౌత్ అవార్డ్స్ లో బెస్ట్ యూజ్ ఆఫ్ టీవీ – మీడియాలో భాగంగా వకీల్ సాబ్ కి జజీ తెలుగు చేసిన ప్రమోషన్స్ కి గాను గోల్డ్ క్యాటగిరీ అవార్డు వారికి లభించిందట, అంతే కాకుండా ప్రయోగాత్మక మార్కెటింగ్ లో ఇదే చిత్రానికి బ్రాంజ్ అవార్డు కూడా వచ్చిందని వారు తెలిపారు.
ఇక ఈ ఏడాదిలో అయితే సీజనల్ మార్కెటింగ్ విభాగంలో అయితే “బంగార్రాజు” సినిమాకి గోల్డ్ అవార్డు వచ్చినట్టు వారు తెలిపారు. మొత్తానికి అయితే ఇలా ఈ రెండు చిత్రాలు ఈ ఛానెల్ కి మంచి పేరు తెచ్చాయని చెప్పాలి.
#VakeelSaab వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ కు చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్ కి #IndianMarketingAwardsSouth లో #ZeeTelugu Best Use Of TV – Media కేటగిరి లో Gold ???? అవార్డ్ గెలుచుకుంది ???????? #IndianMarketingAwardsSouth2022@PawanKalyan#VakeelSaabOnZeeTelugu pic.twitter.com/QAT0SEHFqn
— ZEE TELUGU (@ZeeTVTelugu) September 23, 2022
#VakeelSaab వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ కు చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్ కి #IndianMarketingAwardsSouth లో #ZeeTelugu Best Use Of Experimental Marketing కేటగిరి లో Bronze ???? అవార్డ్ గెలుచుకుంది ???????? #IndianMarketingAwardsSouth2022@PawanKalyan#VakeelSaabOnZeeTelugu pic.twitter.com/kr9bb8yGci
— ZEE TELUGU (@ZeeTVTelugu) September 23, 2022
#Bangarraju వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ కు చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్ కి #IndianMarketingAwardsSouth లో #ZeeTelugu Occasion/ Festive Based or Seasonal Marketing – Media కేటగిరి లో Gold ???? అవార్డ్ గెలుచుకుంది ???????? #IndianMarketingAwardsSouth2022#BangarrajuOnZeeTelugu pic.twitter.com/euRA7aKX2C
— ZEE TELUGU (@ZeeTVTelugu) September 23, 2022