విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా వచ్చిన లైగర్ చిత్రం బ్యాడ్ టాక్ తో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. మొత్తానికి లైగర్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా టీమ్ మొత్తాన్ని ఈ అపజయం బాగా బాధించింది. లైగర్ దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూశారు. అయితే, ఈ చిత్రం గత నెలలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అయింది.
ఇప్పుడు, లైగర్ హిందీ వెర్షన్ అక్టోబర్ 21, 2022న ప్రదర్శించ బడుతుందని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వెల్లడించింది. అనన్య పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. హిందీ వెర్షన్ కూడా ఫ్లాప్ కావడంతో కరుణ్ జోహార్ పై భారీ ట్రోలింగ్ కూడా చేశారు. మొత్తమ్మీద విజయ్ దేవరకొండ పాన్-ఇండియా ఆశలు ఆవిరి అయ్యాయి.