NBK ‘అన్ స్టాపబుల్ – 2’ నెక్స్ట్ ఎపిసోడ్ గెస్టులు వారేనట .. ?

NBK ‘అన్ స్టాపబుల్ – 2’ నెక్స్ట్ ఎపిసోడ్ గెస్టులు వారేనట .. ?

Published on Oct 19, 2022 8:15 PM IST

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ఎంతో క్రేజ్ తో కొనసాగుతున్న షో అన్ స్టాపబుల్ సీజన్ 2. ఇటీవల సీజన్ 1 సక్సెస్ తో సీజన్ 2 ని మరింత ఎంటర్టైనింగ్ గా దెబ్బకు థింకింగ్ మారిపోవాల అనే క్రేజీ కాన్సెప్ట్ తో అద్భుతంగా రూపొందించారు మేకర్స్.

ఇప్పటికే ఇటీవల ప్రసారమైన చంద్రబాబు నాయుడు, లోకేష్ ల ఫస్ట్ ఎపిసోడ్ భారీ స్థాయిలో వ్యూస్ ని సొంతం చేసుకోగా విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరైన సెకండ్ ఎపిసోడ్ కూడా త్వరలో టెలికాస్టింగ్ కి రెడీ అయింది.

అయితే విషయం ఏమిటంటే, ఈ సీజన్ 2 యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కి టాలీవుడ్ దిగ్గజ నటి రమ్యకృష్ణ తో పాటు యువ సక్సెస్ఫుల్ భామ రాశి ఖన్నా గెస్టులుగా విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరూ పాల్గొనే ఎపిసోడ్ ని శుక్రవారం నుండి షూట్ చేయనున్నారట. మొత్తంగా అన్ స్టాపబుల్ సీజన్ 2 రోజు రోజుకు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటూ మరింత క్రేజ్ తో దూసుకుపోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు