తమిళ్ సినిమా నుంచి ఎన్నో అంచనాలు నడుమ చాలా కాలం తర్వాత వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రం “పొన్నియిన్ సెల్వన్”. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రం, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి నటులతో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కించారు. మరి భారీ వసూళ్లతో తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం అయితే మిగతా భాషల్లో మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే రాణించలేదు.
తమిళ్ వెర్షన్ వరకు అయితే భారీ హిట్ అయ్యినటువంటి ఈ చిత్రం ఫైనల్ గా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఈ చిత్రం తమిళ్ తెలుగు సహా ఇతర భాషల్లో గత కొన్ని రోజులు కితం రెంటల్ గా స్ట్రీమింగ్ కి రాగ ఈరోజు నుంచి అయితే ఫ్రీ గా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ చిత్రంని అయితే అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడొచ్చు.