విడుదల తేదీ : నవంబర్ 18, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్, శుభలేక సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్
దర్శకుడు : సాయి కిరణ్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్
ఎడిటర్: జెస్విన్ ప్రభు
సంబంధిత లింక్స్: ట్రైలర్
ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న చిత్రం మసూద. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కి ముందు మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం నేడు థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ:
నజియా (భాంధవి శ్రీధర్) మరియు ఆమె తల్లి నీలం (సంగీత) సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతారు. వారు తమ పొరుగువారి గోపీ కృష్ణ (తిరువీర్,) సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు. అంతా బాగానే ఉన్నప్పుడు, నజియా విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఇది నీలం మరియు గోపి లను పూర్తిగా షాక్‌కి గురి చేస్తుంది. గోపి నీలమ్ తో తన కూతురుకి వ్యాధి ఉందని, భూత వైద్యుల సహాయం అవసరమని చెప్పాడు. నజియా కోలుకుందా? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? నీలం మరియు గోపి ఆమె మామూలుగా మారడానికి సహాయం చేసారా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
అనవసరమైన కామెడీని పెట్టకుండా, హారర్ జానర్‌కు కట్టుబడి ఉన్నందుకు మేకర్స్‌ను అభినందించాలి. ఈ చిత్రం మొదటి నుండి ఒకే ట్రాక్ లో ఉంది, కథ డైవర్ట్ చేయకుండా, హారర్ కొత్త పద్ధతిలో స్టోరీ ను చెప్పడం జరిగింది. ఈ కొత్తదనం సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పాలి.
సినిమాకి సెకండాఫ్ చాలా కీలకం, ఇక్కడే అసలు మిస్టరీ రివీల్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమా కి కీలకం గా మారి ఆకట్టుకున్నాయి. సౌండ్ డిజైన్ చాలా బాగా ఉపయోగించబడింది మరియు సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది.
తిరువీర్‌గా నటించిన గోపి పాత్ర చాలా బాగుంది. అతను అమాయకుడిగా, మంచి వాడి గా చాలా బాగా నటించాడు. సినిమాలో కామెడీ ట్రాక్ లేకపోయినా, అతని పాత్ర, నటన నవ్వులు తెప్పిస్తాయి. ఈ చిత్రం లో సంగీత నటన చాలా బాగుంది. సినిమా ను ముందుకు నడిపించడంలో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్:
సినిమా చాలా వరకు చాలా స్లో గా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో సీన్ నుండి సీన్‌కి ట్రాన్సిషన్ బాగోలేదు, మంచి స్క్రీన్‌ప్లే ఉంటే బాగుండేది.
తిరువీర్ మరియు కావ్య మధ్య లవ్ ట్రాక్ కి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది, అయినప్పటికీ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఒక వైపు ఇంట్రెస్టింగ్ హారర్ యాస్పెక్ట్ నడుస్తుండగా, లవ్ ట్రాక్ వచ్చినప్పుడల్లా సినిమా కాస్త బోర్ కొట్టిస్తుంది. ఈ రొమాంటిక్ పోర్షన్ అసలు ప్లాట్‌కి సంబంధించినది కాదు, కాబట్టి ఈ సన్నివేశాలు కొంచెం తక్కువగా ఉంటే బాగుండేది.
సినిమాకి అసలైన మైనస్ ఏమిటంటే, ఒక్కోసారి ఏం జరుగుతుంది అనేది ఊహించే విధంగా మారిపోతుంది. సినిమా సీరియస్ నోట్‌లో సాగెప్పుడు ఊహించే విధంగా ఉండటం తో ఇది అందరికీ నచ్చక పోవచ్చు. అంతేకాక సినిమా నిడివి పై మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్ పోర్షన్స్ కి సీరియస్ ట్రిమ్మింగ్ అవసరం అని చెప్పాలి.
సాంకేతిక విభాగం:
సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను మరింత ఆసక్తి గా మార్చేశాయి. క్లైమాక్స్‌లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు మంచి ముగింపుని ఇచ్చాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.
ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది. సాయికిరణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పర్వాలేదు అని అనిపించాడు. చక్కటి హారర్ సినిమాను అందించాలనే అతని ఆలోచన బాగుంది. అయితే అతని విజన్ కి తగినట్లు గా స్క్రీన్‌ప్లే సరిపోయేలా ఉంటే ఇంకా బాగుండేది.
తీర్పు:
మొత్తమ్మీద హారర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మసూద చిత్రం కొత్తగా, రియాలిటీ కి దగ్గరగా ఉంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ మరియు టెక్నికల్ బ్రిలియన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. అయితే. ముఖ్యం గా ఫస్ట్ హాఫ్ లో స్లో గా సాగే కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హారర్ చిత్రాలను ఇష్టపడే వారు ఈ వారాంతం ఒకసారి చూడవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team