విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం తదితరులు
దర్శకుడు : నాగ శేఖర్
నిర్మాతలు: రామారావు చింతపల్లి, నాగ శేఖర్, భావన రవి
సంగీత దర్శకులు: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంబంధిత లింక్స్: ట్రైలర్
సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్స్ గా మేఘ ఆకాష్ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘గుర్తుందా శీతాకాలం’. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ :
హీరో సత్యదేవ్ (సత్యదేవ్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో వర్క్ చేస్తుంటాడు. కాలేజీలో అమృత (కావ్యా శెట్టి)ని ప్రేమిస్తాడు. ఆమె లోకంగా బతుకుతాడు. ఐతే, సత్యదేవ్ లైఫ్ లో సెటిల్ కాలేదు అని అమృత అతనికి దూరం అవుతుంది. ఆ తర్వాత సత్యదేవ్ లైఫ్ లోకి నిధి (తమన్నా) వస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అనంతరం వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి?, నిధి కి ఏం జరిగింది ?, చివరకు సత్యదేవ్ ఎలా మారాడు?, ప్రశాంత్ (ప్రియదర్శి) పాత్ర ఏమిటి?, అలాగే ఈ మధ్యలో దివ్య (మేఘా ఆకాష్) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన సత్యదేవ్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన నిధి (తమన్నా), అమృత (కావ్య శెట్టి) పాత్రలు.. ఆ పాత్రలతో సత్యదేవ్ జర్నీ ఇలా మొత్తానికి ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా లవ్ టోన్ తో సాగే ఎమోషనల్ సీన్స్ అండ్ మిగిలిన సీక్వెన్స్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. హీరోయిన్ తమన్నా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించింది. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచింది.
అలాగే, మరో హీరోయిన్ పాత్రలో నటించిన కావ్య శెట్టి కూడా చాలా బాగా నటించింది. ఇక మేఘా ఆకాష్ నటన కూడా బాగుంది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. సుహాసిని, ప్రియదర్శి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ ఎమోషనల్ డ్రామాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా తీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే కంటెంట్ తో బాగా ఆకట్టుకున్నాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ ‘గుర్తుందా శీతాకాలం’ బాగా స్లో గా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
అయితే దర్శకుడు నాగ శేఖర్ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం కూడా బాగాలేదు. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు.
నాగ శేఖర్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని సెంటిమెంట్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఓవరాల్ గా అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు కాల భైరవ సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సత్య హెగ్డే వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘గుర్తుందా శీతాకాలం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకున్నా… పూర్తి స్థాయిలో మాత్రం సినిమా మెప్పించలేకపోయింది. అయితే, కథలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ కథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా లవర్స్ కి కనెక్ట్ అవుతుంది. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం నచ్చదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team