సమీక్ష : శాసనసభ – అక్కడక్కడా పర్వాలేదనిపిస్తుంది

సమీక్ష : శాసనసభ – అక్కడక్కడా పర్వాలేదనిపిస్తుంది

Published on Dec 17, 2022 3:03 AM IST
Sasanasabha Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 16, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ఇంద్ర సేన, డా. రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య రాజ్ భకుని, సోనియా అగర్వాల్, పృధ్వీ రాజ్, అనీష్ కురువిల్లా & ఇతరులు

దర్శకుడు : వేణు మండికంటి

నిర్మాతలు: తులసీరామ్ సప్పని మరియు షణ్ముగం సప్పని

సంగీత దర్శకులు: రవి బసృర్

సినిమాటోగ్రఫీ: కృష్ణ మురళి

ఎడిటర్: గౌతం రాజు

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ శుక్రవారం థియేటర్స్ లో భారీ పోటీ ఉన్నప్పటికీ కొన్ని ఇతర చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఆ చిత్రాల్లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన చిత్రమే “శాసన సభ”. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో సోనియా అగర్వాల్ తదితర నటులు నటించిన ఈ చిత్రానికి కేజీయఫ్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బసృర్ సంగీతం అందించారు. మరి ఇన్ని స్పెషల్స్ ఉన్న ఈ చిత్రం ఎలా ఉందొ సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. ఓ ఫిక్షనల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా అక్కడ ఉన్న పార్టీలలో దేనికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయి మెజార్టీ రాదు దీనితో ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే అక్కడ స్వతంత్ర ఎమ్మెల్యేలు కీలకంగా మారుతారు. మరి వీరిని తమకి సపోర్ట్ చేసే విధంగా మాజీ ముఖ్యమంత్రి దుర్గ(అమిత్ తివారి) అనే రాజకీయ ప్రముఖుణ్ణి సంప్రదిస్తాడు. అయితే ఇతను సూర్య(ఇంద్ర సేన) అనే అతనికి ఓ పెద్ద ఆఫర్ ని ఇచ్చి తనతో పని చెయ్యమంటాడు. మరి ఈ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? ఈ సూర్య ఎవరు? ఈ ఆఫర్ అతను ఒప్పుకుంటాడా? చివరికి మాజీ ముఖ్యమంత్రి ఆశ నెరవేరుతుందా ఇంతకీ ప్రభుత్వం ఎవరు ఏర్పరుస్తారు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రం చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

అన్ని చిత్రాలతో పాటుగా కరెక్ట్ గా డీల్ చేస్తే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మరి అలాగే ఈ చిత్రంలో కూడా కొన్ని కొత్త అంశాలు అయితే ఆసక్తిగా అనిపిస్తాయి. ముఖ్యంగా మొదటి గంట కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. పొలిటికల్ గా వేసే ఎత్తులు వాటికి పైఎత్తులు ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి.

అలాగే డైలాగ్స్ కూడా ఈ చిత్రంలో మంచి ప్రభావవంతంగా కనిపిస్తాయి. అలాగే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కొన్ని అంశాలు ఎలా నష్టాలు చేకూరుస్తున్నాయి వాటి వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే అంశాలు మెచ్చుకునే విధంగా ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో నటించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన వెర్సటైల్ నటనను కనబరిచారు.

అలాగే ఇంద్రసేన మంచి రోల్ లో కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కానీ ఇతర కీలక సన్నివేశాల్లో బాగా నటించాడు. అలాగే సోనియా అగర్వాల్, అజిహ్వర్య రాజ్ లు తమ పాత్రల్లో డీసెంట్ నటన కనబరిచారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో పలు అంశాలు ఎంతైతే ఎంగేజింగ్ గా అనిపిస్తాయి అదే విధంగా మరికొన్ని అంశాలు డిజప్పాయింటింగ్ గా ఉంటాయి. సినిమా మొదటి సగం అంత బాగానే ఉంటుంది కానీ అక్కడ నుంచి కీలకమైన సెకండాఫ్ మాత్రం నిరాశపరుస్తుంది అని చెప్పాలి. ఇక్కడ నుంచి సీన్స్ కాస్త రొటీన్ గా అలాగే బాగా ల్యాగ్ గా కూడా కనిపిస్తాయి.

దీనితో ఆడియెన్స్ లో అప్పటివరకు ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలాగే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా అంత మెప్పించే విధంగా అనిపించకపోగా వాటి వల్ల కూడా సినిమా సాగదీతగా ఉన్నట్టు అనిపిస్తుంది.

అలాగే ఈ తరహా చిత్రాలకు చాలా వరకు పాటలు కూడా కీలకంగా ఉంటాయి కొన్నిటికి సూటవ్వవు అలాగే ఈ సినిమాలో కూడా పాటలు అంత పర్ఫెక్ట్ గా అనిపించవు. ఇంకా కొన్ని సీన్స్ లో విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది.

 

సాంకేతిక వర్గం :

 

చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు. టెక్నీకల్ టీం లో వి ఎఫ్ ఎక్స్ ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది అలాగే రవి బసృర్ ఇచ్చిన స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే సెకండాఫ్ లో ఎడిటింగ్ బాగా చెయ్యాల్సింది. అలాగే డైలాగ్స్ వర్కౌట్ అవుతాయి.

ఇక దర్శకుడు వేణు మండికంటి విషయానికి వస్తే..తన వర్క్ పర్వాలేదని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు సాలిడ్ గా తన నరేషన్ కనిపిస్తుంది. కానీ సెకండాఫ్ లో ఎందుకో ఆ సీరియస్ నెస్ మిస్ అయ్యింది. దానిని కూడా తాను ఒడిసి పట్టినట్టు అయితే మరింత మంచి అవుట్ పుట్ ఈ చిత్రానికి డెఫినెట్ గా వచ్చి ఉండేది అని చెప్పాలి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టుగా అయితే పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ “శాసన సభ”లో ఫస్టాఫ్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆసక్తికర కథనం సహా ఆలోచింపజేసే అంశాలతో ఆకట్టుకుంటుంది. కాకపోతే సెకండాఫ్ లో ఈ ఫ్లో బాగా మిస్ అవుతుంది. దీనితో ఈ చిత్రం అక్కడక్కడా వరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఈ రెండో సగం కూడా జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే మంచి పొలిటికల్ డ్రామాల చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచేది. ఓవరాల్ గా అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఇష్టపడే వారు అయితే ఒకసారి ఈ చిత్రాన్ని చూడవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు