ఇంటర్వ్యూ : హీరోయిన్ శ్రీలీల – రవితేజ గారితో మూవీ చేయడం నా అదృష్టం – ‘ధమాకా’ మంచి ఎంటర్ టైనర్

ఇంటర్వ్యూ : హీరోయిన్ శ్రీలీల – రవితేజ గారితో మూవీ చేయడం నా అదృష్టం – ‘ధమాకా’ మంచి ఎంటర్ టైనర్

Published on Dec 21, 2022 5:02 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ ధమాకా. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీని త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫాక్టరీ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాయి. డిసెంబర్ 23న గ్రాండ్ గా ధమాకా మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా నేడు ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించారు శ్రీలీల.

 

ధమాకా ప్రాజక్ట్ అవకాశం మీకు ఎలా వచ్చింది ?

నిజానికి త్రినాధరావు నక్కిన గారు గతంలో తెరకెక్కించిన హలొ గురు ప్రేమకోసమే మూవీలో ఒక పాత్ర కోసం దర్శకుడు త్రినాధరావు నన్ను సంప్రదించారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పాత్ర చేయడం కుదరలేదు. ఆ సమయంలో కథకుడు బెజవాడ ప్రసన్న కుమార్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది. పెళ్లిసందడి మూవీ రిలీజ్ కి ముందే నాకు ధమాకా మూవీ అవకాశం వచ్చింది. కథ విన్న అనంతరం ఎంతో నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాను.

 

ధమాకా స్టోరీ ని ఓకె చేయడానికి కారణం ?

ధమాకా మూవీ చాలా మంచి ఎంటర్టైనర్, మూవీ అంతా ఎంతో హిలేరియస్ గా ఉంటుంది, నాకు ఇటువంటి మూవీస్ అంటే ఎంతో ఇష్టం, అలానే కథ కూడా నచ్చడంతోనే ఒప్పుకున్నాను.

 

తక్కువ సమయంలోనే రవితేజ వంటి స్టార్ తో వర్క్ చేస్తున్నారు కదా ? మీ ఫీలింగ్ ఏంటి ?

 

నిజంగా నా ఫస్ట్ మూవీనే రాఘవేంద్ర రావు గారితో లాంచ్ కావడం, ఆ తర్వాత రవితేజ గారి వంటి పెద్ద స్టార్ తో ధమాకా లాంటి బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా వుంది. రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా రవితేజ గారు లాంటి స్టార్ హీరో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. మొదట్లో మాట్లాడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఆయనతో పని చేస్తుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ ని, ముఖ్యంగా కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. తన పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా ఆయన పలికించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే విక్రమార్కుడు డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు. తప్పకుండా మూవీ అందరి అంచనాలు అందుకుంటుంది.

 

రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ చేయగలిగారా మరి ?

సినిమా చూసి అది మీరే చెప్పాలి. ముఖ్యంగా పలు సీన్స్ తో పాటు డ్యాన్స్ కూడా బాగా ట్రై చేశాను, ఓవరాల్ గా అయితే ఆయన ప్రక్కన చేయడం నిజంగా ఎంతో సూపర్ ఫీలింగ్.

 

దర్శకుడు త్రినాధరావు తీసిన గత సినిమాలు చూసారా ?

అవును చూసాను, ముఖ్యంగా అయన నాని గారితో తీసిన నేను లోకల్ మూవీలో సాంగ్స్ నేను బెంగళూరు లో ఉన్నపుడు ఎక్కువగా వినేదాన్ని, అలానే ఆ మూవీలో కీర్తి సురేష్ గారి పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం. అటువంటి డైరెక్టర్ తో నేను ప్రస్తుతం వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

 

ధమాకా లో మీ ఫేవరేట్ సాంగ్ ?

జింతాక్ సాంగ్ బాగా నచ్చింది, అలానే వాట్స్ హ్యాపెనింగ్ సాంగ్ కూడా ఎంతో ఇష్టం. అందులో వయొలీన్ ట్యూన్ చాలా బాగుంటుంది.

 

ట్రైలర్ లో ఇద్దరు ఇష్టం అనే డైలాగ్ చెప్పారు కదా, ఇందులో మీ రోల్ ఎలా ఉంటుంది ?

నేను ఇందులో ప్రణవి అనే రోల్ చేశాను. సినిమాలో ఇద్దరూ ఇష్టం నాకు, అయితే ఒక్కో సందర్భంలో ఎవరు ఎవరా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఫైనల్ గా మాత్రం సినిమాలో ఏమవుతుంది అనేది మంచి ట్విస్ట్.

 

ధమాకా మూవీ షూట్ లో మీ స్వీట్ మెమొరీస్ ?

మేము జింతాక్ సాంగ్ ని స్పెయిన్ లో షూట్ చేసాము, అయితే అక్కడ సాంగ్ షూట్ కి ఒక రోజు ముందు నా కాస్ట్యూమ్స్ బ్యాగ్ పోయింది. ఆ వెంటనే నాకు ఎంతో టెన్షన్ అనిపించింది. అయితే పరిస్థితి అర్ధం చేసుకున్న డీవోపీ, డైరెక్టర్ ఇద్దరూ కూడా దగ్గర్లోని కొన్ని ప్రదేశాలకు వెళ్లి కొంత షాపింగ్ చేసి పలు డ్రెస్ ల ఫోటోలు షేర్ చేసారు. అనంతరం వాటిలో కొన్ని ఫైనలైజ్ చేసాము. ఆ విధంగా వారు షాపింగ్ చేయడం నా ఫ్యామిలీ మెంబర్స్ నాకోసం చేసినట్లు అనిపించింది. నిజంగా అదొక స్వీట్ మెమరీ.

 

ధమాకా నిర్మాతల గురించి ?

నిజంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఎంతో చక్కగా నన్ను చూసుకున్నారు. అలానే మన అమ్మాయి అనే ఫీలింగ్ వారిలో ఎప్పుడూ ఉంటుంది, ఎంతో చక్కగా చూసుకోవడంతో నాకు ఫ్యామిలీ తో ట్రావెల్ చేసినట్లు అనిపించింది. ఫైనల్ గా మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను, అలానే లోపల కొంత నెర్వస్ గా కూడా ఉంది.

 

మీ నెక్స్ట్ మూవీస్ గురించి చెప్పండి?

బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి గారితో చేస్తున్న మూవీ లేటెస్ట్ గా స్టార్ట్ అయింది. అలానే బోయపాటి, రామ్ కలయికలో వస్తున్న మూవీ కూడా చేస్తున్నాను. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక మూవీ, నితిన్ గారితో ఒక మూవీ, వారాహి ప్రొడక్షన్స్ లో ఒకటి, అలానే మరికొన్ని ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే చెప్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు