ట్విట్టర్ లో మూడు మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న మెగాపవర్ స్టార్

ట్విట్టర్ లో మూడు మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న మెగాపవర్ స్టార్

Published on Mar 10, 2023 11:30 PM IST

టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హీరోగా ఒక్కో సినిమాతో ఆడియన్స్, ఫ్యాన్స్ మంచి క్రేజ్ తో పాటు పలు భారీ సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ తో టచ్ లో ఉండే మెగాపవర్ స్టార్, నేడు తన ట్విట్టర్ లో ఏకంగా 3 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఒకింత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న చరణ్ ఎప్పటికప్పుడు పలు వ్యక్తిగత విషయాలకు సంబందించిన పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స్ తో మరింతగా మమేకం అవుతున్నారు. కాగా శంకర్ మూవీ అనంతరం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన తో రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ చేయనున్న సంగతి తెల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు