విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే, జగపతి బాబు, జాస్సీ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, ఇతరులు
దర్శకుడు : ఫర్హాద్ సామ్జీ
నిర్మాత: సల్మాన్ ఖాన్
సంగీత దర్శకులు: హిమేష్ రేష్మియా, రవి బస్రూర్, సుఖ్బీర్ సింగ్, దేవి శ్రీ ప్రసాద్, సాజిద్ ఖాన్, పాయల్ దేవ్, అమల్ మల్లిక్
సినిమాటోగ్రఫీ: వి.మణికందన్
ఎడిటర్: మయూరేష్ సావంత్
సంబంధిత లింక్స్: ట్రైలర్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఈరోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించారు. మంచి బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అందుకు అనుగుణంగా అంచనాలను అందుకుందో లేదో సమీక్షను లోకి వెళ్ళి చూద్దాం.
కథ:
భాయిజాన్ (సల్మాన్ ఖాన్) తన ప్రియమైన సోదరులు – మోహ్ (జాస్సీ గిల్), లవ్ (సిద్ధార్థ్ నిగమ్) మరియు ఇష్క్ (రాఘవ్ జుయల్) ల నుండి ఒక అమ్మాయి విడదీయకూడదు అని పెళ్ళి చేసుకోకుండా ఉంటాడు. భాగ్య లక్ష్మి గుండమనేని (పూజా హెగ్డే), ఒక హైదరాబాదీ, భాయిజాన్ ఇంట్లో అద్దెకు వస్తుంది. అంతేకాక వివాహం పట్ల భాయిజాన్ కి ఉన్నటువంటి దృక్పథాన్ని మారుస్తుంది. ఒకరోజు గూండాలు వారి పై దాడి చేస్తారు. వారు భాగ్య వెంట పడుతున్నారు అని భాయిజాన్ తెలుసుకుంటాడు. భాగ్య ఎవరు? భాగ్యను గూండాలు ఎందుకు చంపాలనుకున్నారు? అన్నయ్య (వెంకటేష్) ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సల్మాన్ ఖాన్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌తో ప్రేక్షకులని అలరించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌లో చాలా బాగా నటించాడు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో డైలాగ్స్ మరియు ఎమోషనల్ సీన్స్‌లో అతని నటన బాగున్నాయి.
తెలుగు స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్‌కి ఈ సినిమాలో మంచి పాత్ర దొరికింది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. పైన చెప్పినట్లుగా, సల్మాన్ ఖాన్‌తో వచ్చే అతని సన్నివేశాలు చాలా బాగున్నాయి.
పూజా హెగ్డే ఈ సినిమాలో చాలా అందంగా ఉంది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటుల పెర్ఫార్మెన్స్ ఓకే. ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. మెట్రో ఫైట్, వెంకీ ఇంటిపై గూండాలు దాడి చేసే సన్నివేశాలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ సాధించిన వీరమ్ (2014)కి అఫీషియల్ రీమేక్ అని అందరికీ తెలుసు, ఇది తెలుగులో కాటమరాయుడు (2017) పేరుతో మరియు కన్నడలో ఒడెయ (2019)గా రీమేక్ చేయడం జరిగింది. అయితే, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ కథను కొంచెం మార్చడం జరిగింది.
సల్మాన్ ఖాన్ యాక్టర్ గా మాట్లాడుకుంటే, ఈ సినిమాలో చాలా బాగా చేశారు. కానీ, అతనికి ఉన్న స్టార్డం కి ఇది బిలో యావరేజ్ మూవీ. తెలుగు, కన్నడ లో అంతగా వర్కౌట్ కానీ ఈ స్క్రిప్ట్ ను ఎన్నుకోవడం సల్మాన్ తప్ప అని చెప్పాలి. ఒకానొక టైమ్ లో ఇది సల్మాన్ ఖాన్ చిత్రమా? లేక వెంకీ చిత్రమా అనే డౌట్ వస్తుంది. కొన్ని సన్నివేశాలను చూస్తే అలానే అనిపిస్తుంది.
కథ అంతగా డెప్త్ లేదు. ఎవరైనా ఈజీ గా ఇది ఔట్ డేటెడ్ స్క్రిప్ట్ అని కనిపెట్టేస్తారు. సీరియస్ సన్నివేశాల మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బోరింగ్ గా ఉంటాయి. సన్నివేశాల మధ్యన ఉండే కనెక్టివిటీ అంతగా బాగోదు.
టాలీవుడ్ స్టార్ నటుడు అయిన జగపతి బాబు ను పవర్ ఫుల్ విలన్ గా చూపించడం లో డైరెక్టర్ విఫలం అయ్యాడు అని చెప్పాలి. అతని యాక్షన్ సన్నివేశాలు, డైలాగులు చాలా ఓల్డ్ గా అనిపిస్తాయి. సినిమాలో భూమికా చావ్లా పాత్ర అంతగా ఏమీ లేదు.
కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి. కానీ అవి సందర్భానుసారం గా రావు. అంతేకాక స్టోరీ ను డిస్టర్బ్ చేసే విధం గా ఉంటాయి. క్లైమాక్స్ చాలా బోరింగ్ గా, ఔట్ డేటెడ్ గా ఉంటుంది. డైరెక్టర్ ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఆకట్టుకొని సన్నివేశాలు చాలా ఉన్నాయి.
ఫర్హద్ సంజి, స్పర్శ్ ఖేతర్పాల్, తశ భాంబ్ర స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు. అవి బాగానే ఉన్నాయి. కానీ సల్మాన్ ఖాన్ పాత్రకి ఇంకాస్త మెరుగులు దిద్ది ఉండాల్సి ఉంది.
సాంకేతిక విభాగం:
చిత్ర దర్శకుడు సినిమాతో అంతగా ఆకట్టుకోలేదు. ఇలాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. రవి బస్రూర్ ఎమోషనల్ సన్నివేశాలకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
మొత్తమ్మీద కిసి కా భాయ్ కిసీ కి జాన్ అంతగా ఆకట్టుకోలేదు. ఆకట్టుకొని కథనం తో సినిమా బోరింగ్ గా సాగుతుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, సల్మాన్ ఖాన్ నటన తప్ప సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, బోరింగ్ కథనం సినిమా రిజల్ట్ ను దెబ్బతీశాయి. ఈ వారం ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team