సమీక్ష: రామబాణం – రొటీన్ గా సాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్

సమీక్ష: రామబాణం – రొటీన్ గా సాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్

Published on May 6, 2023 3:03 AM IST
Ramabanam Movie Review In Telugu

విడుదల తేదీ : మే 05, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ సుందర్, డింపుల్ హాయాతీ, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేదేఖర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను

దర్శకులు : శ్రీవాస్

నిర్మాతలు: టీ. జీ. విశ్వ ప్రసాద్

సంగీత దర్శకులు: మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ: వెట్రి పలనిసామి

ఎడిటర్: ప్రవీన్ పూడి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

గోపీచంద్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై ఆసక్తి నెలకొంది. రిలీజ్ కి ముందు మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

రాజారాం(జగపతి బాబు) నమ్ముకున్న సిద్ధాంతాలతో హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. స్వచ్ఛమైన ఆహారం ను అందించాలనే లక్ష్యంతో ఉంటాడు. రాజారాం అనుసరిస్తున్న విధానం వలన పాపారావు (నాజర్) కుట్రలు పన్నుతూ ఉంటాడు. అయితే పాపారావు చేసే అన్యాయం ను తట్టుకోలేక హీరో విక్కీ (గోపీచంద్), రాజారాం తమ్ముడు పాపారావు కి ఎదురు తిరుగుతాడు. విక్కీ బిహేవియర్ నచ్చని రాజారాం తమ్ముడు ను మందలిస్తాడు. అది నచ్చని విక్కీ సొంత ఊరు వదిలి కోల్కతా చేరుకుంటాడు. అక్కడ తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? విక్కీ కి ఎవరు సహాయం చేశారు? అక్కడ ఎదురైన శత్రువులను ఎలా ఎదిరించాడు? తన అన్న రాజారాం కి ఎలాంటి సమస్యలు ఎదురు అయ్యాయి? భైరవి (డింపుల్ హయాతీ) తో ప్రేమలో పడిన విక్కీ, తన ప్రేమను గెలుపొందడం కోసం ఏం చేశాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

సినిమాలో చెప్పదలచుకున్న పాయింట్ ను డైరెక్టర్ బాగా చెప్పే ప్రయత్నం చేసారు. స్వచ్ఛమైన ఆహారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత ఉపయోగకరం, దాని ప్రాముఖ్యత ను వివరించడం బాగుంది.అలాగే సినిమాలో అన్నదమ్ముల అనుబంధం, కుటుంబం ఐక్యత గురించి పలు సన్నివేశాలు బాగున్నాయి.

అలాగే ఎంత సంపాదించినా, కుటుంబం ఎంతో ముఖ్యం అని చెప్పే విషయాలు బాగున్నాయి. సినిమాలో గోపీచంద్, జగపతి బాబు ల నటన తో పాటుగా, ఇతర నటీనటుల సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. డైలాగులు బాగున్నాయి. కుటుంబ సన్నివేశాలు చాలా బాగున్నాయి.

సినిమాలో హీరోయిన్ భైరవి (డింపుల్ హాయాతీ) పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే గోపీచంద్ తో కెమిస్ట్రీ కూడా బాగుంది. గోపిచంద్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ బాగున్నాయి. తన అన్నకొసం గోపీచంద్ ఎదురు తిరిగే సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వల్ బ్లాక్ తో పాటుగా, క్లైమాక్స్ సినిమాకి మంచి ఆకర్షణ అని చెప్పొచ్చు.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ చిత్రంలో పెద్ద మైనస్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే అది బోరింగ్ ప్లే అని చెప్పాలి. పైగా సినిమాలో కొత్త కంటెంట్ కూడా కనిపించదు. వీటితో పాటుగా బాగా రొటీన్ గా ఊహించదగ్గ లెవెల్లోనే సాగే కథనం మరో మైనస్ అని చెప్పక తప్పదు. ఔట్ డేటెడ్ కంటెంట్ తో పాటుగా, స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ ఉంటుంది. అనవసరమైన సన్నివేశాలు అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించదు.

ఇక ఫస్ట్ హాఫ్ లో ఉన్నటువంటి వేగం సెకండాఫ్ వచ్చే సరికి తగ్గిపోతుంది. కొన్ని పాత్రలకి ప్రాముఖ్యత లేకపోయినా, డైరెక్టర్ సన్నివేశాలను ఇరికించినట్లు ఉంటుంది. సినిమాలో ఎలాంటి కొత్తదనం కూడా మనకి కనిపించదు. హీరో పాత్రను డిజైన్ చేసిన విధానం బాగున్నా, ఎక్కువగా వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగా ఓవర్ ఫీల్ తెప్పిస్తాయి.

 

సాంకేతిక విభాగం:

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్యామిలీ డ్రామాకి కావాల్సిన సెటప్ అంతా మేకర్స్ బాగా డిజైన్ చేశారు. ఇక టెక్నీకల్ టీం లో అయితే మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సాంగ్, తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీట్ గా ఉన్నాయి. అలాగే డైలాగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ మాత్రం బెటర్ గా చేయాల్సింది. చాలా ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు శ్రీవాస్ విషయానికి వస్తే..గోపీచంద్ తో ఇది వరకే మంచి హిట్స్ ఇచ్చిన తాను ఈ సినిమాకి మాత్రం పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోయారని చెప్పక తప్పదు. కొన్ని సీన్స్ మరియు ఎమోషన్స్ వరకు పర్వాలేదు కానీ కొత్త కంటెంట్ ఏమన్నా ట్రై చేయాల్సింది. స్క్రీన్ ప్లే కూడా కాస్త రొటీన్ గానే సాగుతుంది. దీనితో ఈ చిత్రం మాత్రం కొంతమందికే కొన్ని అంశాల్లో మాత్రమే కనెక్ట్ కావచ్చు.
 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. బాలయ్య సజెస్ట్ చేసిన “రామబాణం” టైటిల్ తో వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేదని చెప్పాలి. సినిమాలో గోపీచంద్ సిన్సియర్ పెర్ఫామెన్స్, చిన్న మెసేజ్, కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంటాయి కానీ ఔట్ డేటెడ్ కంటెంట్, ముందుగానే ఊహించేలా వచ్చే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం ఫలితాన్ని బాగా దెబ్బతీశాయి. దీనితో ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటుగా, యాక్షన్ ఎపిసోడ్స్ ను ఎంజాయ్ చేసేవారు ఏ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఒక్కసారికి ఈ చిత్రాన్ని చూడవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు