సమీక్ష : అహింస – ఆకట్టుకోని లవ్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : అహింస – ఆకట్టుకోని లవ్ యాక్షన్ డ్రామా !

Published on Jun 3, 2023 3:04 AM IST
Ahimsa Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 02, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అభిరామ్, గీతిక, రజత్ బేడీ, సాధా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు

దర్శకులు : తేజ

నిర్మాతలు: పి కిరణ్

సంగీత దర్శకులు: ఆర్పీ పట్నాయక్

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

దర్శకుడు తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ అహింస. గీతికా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసా వాధి. తనను ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేసినా.. హింసకి దూరంగా ఉంటాడు. అయితే, రఘును ప్రాణంగా ప్రేమించిన అహల్య (గీతిక) పై హత్యాచారం చేసి.. ఆమెను అంతం చేయడానికి విలన్లు ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అహింసా వాధి అయిన రఘు కిరాతకుడిగా ఎలా మారిపోయాడు?, తాను ప్రాణంగా ప్రేమించిన అహల్య కోసం అతను ఏం చేశాడు ?, ఈ మధ్యలో లాయర్ లక్ష్మి (సదా) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన పాత్ర దగ్గుబాటి అభిరామ్.. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన అహల్య (గీతిక).. ఆమెకు జరిగిన అన్యాయం, దానికి అభిరామ్ రివేంజ్ జర్నీ ఇలా మొత్తానికి ‘అహింస’ సినిమా కొన్ని చోట్ల జస్ట్ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషన్స్ తో సాగే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ మిగిలిన సీక్వెన్స్ లు పర్వాలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన అభిరామ్ తన పాత్రకు తగ్గట్లు బాగానే నటించాడు.

హీరోయిన్ గీతికా తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన సదా కూడా చాలా బాగా నటించింది. ఇక తల్లి పాత్రలో కల్పలత నటన బాగుంది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, దేవి ప్రసాద్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ ‘అహింస’లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో అభిరామ్ క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అయితే దర్శకుడు తేజ పనితనం ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం, సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం వంటి ఎలిమెంట్స్ బాగాలేదు. మొత్తమ్మీద దర్శకుడు తేజ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని లవ్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సమీర్ రెడ్డి వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

‘అహింస’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని లవ్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు