విడుదల తేదీ : జూన్ 23, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: వసంత్ రవి, విమలా రామన్, మురళీధరన్, సరస్ మీనన్, ఉదయ దీప్ మరియు సిమ్రాన్ పరీక్
దర్శకుడు : తరుణ్ తేజ
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీతం: విజయ్ సిద్ధార్థ్
సినిమాటోగ్రఫీ: ఎ ఎమ్ ఎడ్విన్ సాకే
ఎడిటర్: వెంకట్ రాజన్
సంబంధిత లింక్స్: ట్రైలర్
లేటెస్ట్ గా డీసెంట్ బజ్ తో వచ్చిన ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ చిత్రం “అస్విన్స్” కూడా ఒకటి. మరి కొత్త దర్శకుడు తరుణ్ తేజ తమిళ్ తెలుగులో తెరకెక్కించిన ఈ చిత్రం వసంత్ రవి విమలా రామన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథ లోకి వస్తే..ఓ ఇండియన్ వ్లాగర్ అర్జున్(వసంత్ రవి) లండన్ లో వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. అయితే తాను తన టీం తో ఒక హాంటెడ్ హౌస్ ని వ్లాగ్ చేయడానికి వెళ్తారు. ఇక ఆ ఇంటికి వెళ్ళాక వారి టీం ఆ ఇంట్లో కొన్ని అనుమానాస్పద అంశాలు జరుగుతున్నట్టుగా గుర్తిస్తారు. మరి అక్కడ నుంచి ఏం జరిగింది?ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది? అక్కడేం జరిగింది? ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) పాత్ర ఈ సినిమాలో ఏంటి? ఇంతకీ వారు ఆ ఇంటి నుంచి బయటకి వచ్చారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా చూసాక మొదటగా బాగా ఇంప్రెస్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా సౌండ్ డిజైన్ అని చెప్పాలి. ఈ తరహా హారర్ లేదా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకి ఈ సౌండ్ చాలా ముఖ్యం. కానీ ఈ చిత్రంలో ఈ సౌండ్ డిజైన్ పలు కీలక సన్నివేశాల్లో అయితే మరింత థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
ఇక దీనితో పాటుగా ఈ సినిమాలో విజువల్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి. అలాగే కొన్ని హారర్ సహా మైథలాజికల్ సన్నివేశాలు ఆడియెన్స్ లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇక మెయిన్ లీడ్ లో కనిపించిన నటుడు వసంత్ రవి సాలిడ్ పెర్ఫామెన్స్ ని తన పాత్రలో అందించాడు. తన రోల్ ప్రొసీడింగ్ మెల్లగానే స్టార్ట్ అయినా క్లైమాక్స్ కి అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఇక మరో నటి విమలా రామన్ కి స్క్రీన్ స్పేస్ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మంచి రోల్ లో అయితే తాను కనిపించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో కథ బాగున్నప్పటికీ నరేషన్ మాత్రం ఒకింత అర్ధం చేసుకోవడానికి మాత్రం కష్టతరంగా అనిపించవచ్చు. దీనితో అన్ని వర్గాల ఆడియెన్స్ కి ఈ చిత్రం ఒకేసారి కనెక్ట్ కాదు. అలాగే సినిమాలో ఆసక్తిగొల్పే సన్నివేశాలు ఉన్నాయి కానీ పలు చోట్ల మాత్రం నరేషన్ డల్ గా కొనసాగుతుంది.
అలాగే కొన్ని అంశాలు ఇంకా నీట్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే సినిమాలో కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న సీక్వెన్స్ లో వి ఎఫ్ ఎక్స్ లు చాలా సింపుల్ గా తెలిసిపోతూ ఉంటాయి. వాటిని ఇంకా బెటర్ గా చేయాల్సింది. మెయిన్ గా క్లైమాక్స్ లో ఇంకా బెటర్ గా చేయాల్సింది. అలాగే కాస్టింగ్ పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పొచ్చు. మెయిన్ గా టెక్నీకల్ టీం లో సౌండ్ అండ్ సినిమాటోగ్రఫీ క్రాఫ్ట్ వర్క్స్ ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. ఎడిటింగ్, డైలాగ్స్ బాగున్నాయి. వి ఎఫ్ ఎక్స్ కొన్ని చోట్ల బెటర్ చేయాల్సింది.
ఇక దర్శకుడు తరుణ్ తేజ విషయానికి వస్తే తాను ఈ థ్రిల్లర్ ని హ్యాండిల్ చేయడంలో చిన్న చిన్న ఫ్లాస్ తో అయితే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ సెటప్ తీసుకొని సాలిడ్ టీం వర్క్ తో అయితే ఓ క్రేజీ హారర్ థ్రిల్లర్ ని తాను తెరకెక్కించిన విధానానికి మెచ్చుకొని తీరాలి. సినిమాలో తాను చూపించిన కలర్ స్కీమ్స్ గాని సౌండ్ డిజైనింగ్ గాని మూవీ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయి.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “అస్విన్స్” అక్కడక్కడా కొన్ని ఎలిమెంట్స్ వరకు బాగుంది అనిపిస్తుంది. టెక్నికల్ ఎలిమెంట్స్ పరంగా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. అలాగే మెయిన్ లీడ్ సాలిడ్ పెర్ఫామెన్స్ లు కూడా ఆకట్టుకోగా కొన్ని బోరింగ్ సీన్స్ తో సినిమా కాస్త పేలవంగా అనిపిస్తుంది. మరి వీటితో తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ సినిమా ఓసారికి చూడొచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team