విడుదల తేదీ : జూన్ 23, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాస్తవ్, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, హర్షిత చౌదరి, గరిమా కౌశల్
దర్శకుడు : భరత్ పెద్దగాని
నిర్మాతలు: నరాల శ్రీనివాస్ రెడ్డి
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంబంధిత లింక్స్: ట్రైలర్
శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రల్లో నటించిన మను చరిత్ర ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ పెద్దగాని రచన మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ:
అకడమిక్ టాపర్ అయిన మను (శివ కందుకూరి) చాలా మంది అమ్మాయిలను ప్రేమిస్తాడు, కానీ అతను ఎటువంటి కారణం చెప్పకుండా అందరితో విడిపోతాడు. అతను శ్రావ్య (ప్రియా వడ్లమాని)ని ప్రేమిస్తాడు మరియు శ్రావ్య కూడా అతన్ని ప్రేమిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మను శ్రావ్యతో తన ప్రేమ సంబంధం ను ముగించాలనుకుంటున్నట్లు చెబుతాడు. శ్రావ్యతో మను సంబంధంను ఎందుకు ముగించాడు? సంబంధం కొనసాగించాలనే ఉద్దేశ్యం లేనప్పుడు, చాలా మంది అమ్మాయిలను మను ఎందుకు ప్రేమిస్తున్నాడు? అతను లోకల్ రౌడీ అయిన రుద్ర (ధనంజయ్)తో ఎలా కనెక్ట్ అయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
హీరో పాత్రను సినిమాలో చాలా బాగా డిజైన్ చేశారు. బాగా దుఃఖంలో ఉన్న వ్యక్తిగా శివ కందుకూరి నటన ఆకట్టుకుంటుంది. ఫ్లాష్‌బ్యాక్ లో అతని లుక్స్ మరియు పెర్ఫార్మెన్స్ సినిమాలో బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. శివ కందుకూరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ కూడా మను చరిత్ర చిత్రం శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది.
హీరోయిన్ మేఘా ఆకాష్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. ఆమె తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది అని చెప్పాలి. ఆమె సన్నివేశాలన్నీ వెండితెర పై చాలా బాగా వచ్చాయి. శివ కందుకూరితో తన కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రగతి శ్రీవాస్తవ్ నటన ఆకట్టుకుంటుంది. నార్త్ ఇండియన్ అమ్మాయిగా ఆమె బాగా నటించింది.
మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం సినిమాని మరోక హైలైట్. రెండు పాటలు చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మంచి స్పీడ్ తో సాగుతుంది. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు బాగున్నాయి. సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, మరియు ప్రియా వడ్లమాని వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ ఏమిటంటే రన్ టైమ్. ఎక్కువ రన్ టైమ్ ను కలిగి ఉంది. ముఖ్యంగా సెకండాఫ్ స్లోగా ఉంది. కొన్ని సీక్వెన్స్‌లను మేకర్స్ ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది. కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ, సుదీర్ఘ రన్‌టైమ్ కారణంగా అంత ఎఫెక్టివ్ గా ఉండవు.
హీరో ఎక్కువ మంది అమ్మాయిలను ఎందుకు ప్రేమిస్తాడనే కారణాన్ని ఇంకా బెటర్ గా చూపించే అవకాశం ఉంది. ఎమోషన్స్, స్క్రీన్ ప్లే సాగే విధానం సెకండ్ హాఫ్ లో అంతగా ఆకట్టుకోదు. కొన్ని సన్నివేశాలు గత చిత్రాలను గుర్తుకు తెస్తాయి.
ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు డైరెక్టర్ చూపించినప్పుడు సినిమా బాగుంది. కానీ స్క్రీన్ ప్లే రౌడీల యాంగిల్‌కి మారినప్పుడు సినిమా బోరింగ్‌గా మారుతుంది. ఈ చిత్రంలో ధనంజయ్ రెగ్యులర్ విలన్‌గా నటించాడు. కొత్తగా చేయడానికి ఏమీ లేకపోవడం తో, అతని పాత్ర అంతగా ఆకట్టుకోదు. సినిమాలో డైలాగులు అంత బాగోలేదు.
సాంకేతిక విభాగం:
గోపీ సుందర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మను చరిత్ర చిత్రానికి బిగ్ ప్లస్ పాయింట్. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అతను వరంగల్ నగరాన్ని చాలా బాగా చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైలాగ్స్ ఇంకాస్త బాగుండేవి. ఎడిటింగ్ పై కాస్త ఫోకస్ చేసి ఉండాల్సింది.
డైరెక్టర్ భరత్ పెద్దగాని విషయానికి వస్తే, అతను సినిమాతో అంతగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా ఉండగా, సెకండ్ హాఫ్ ఎక్కువ రన్ టైమ్ ను కలిగి ఉంది. లవ్ సీన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం బాగానే ఉంది. కానీ పాలిటిక్స్, గూండాలకి సంబంధించిన సన్నివేశాలకు ఇంకాస్త పెర్ఫార్మెన్స్ ఉండి ఉంటే బాగుండేది.
తీర్పు:
మొత్తం మీద, రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మను చరిత్ర అంతగా ఆకట్టుకోదు. అక్కడక్కడా వచ్చే లవ్ సన్నివేశాలు సినిమాలో బాగున్నాయి. శివ కందుకూరి, మేఘా ఆకాష్ తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. స్లో గా సాగే స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమా రన్ టైమ్, సెకండాఫ్ విషయంలో వచ్చే స్లో సన్నివేశాలను విస్మరిస్తే, ఒకసారి ఈ చిత్రాన్ని చూడవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team