కిచ్చా సుదీప్ 46 : భారీ అప్‌డేట్ ని అందించిన మేకర్స్

కిచ్చా సుదీప్ 46 : భారీ అప్‌డేట్ ని అందించిన మేకర్స్

Published on Jun 27, 2023 10:00 PM IST

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇటీవల విక్రాంత్ రోనా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఇటీవల విడుదలైన కబ్జాలో ఆయన ఒక పాత్రలో కనిపించినప్పటికీ, అది కేవలం అతిధి పాత్ర మాత్రమే. కాగా సుదీప్ 46వ సినిమా కి సంబంధించి నేడు మేకర్స్ ఒక భారీ అప్‌డేట్‌ను అందించారు.

దీని ప్రకారం, ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని జూలై 2వ తేదీన ఉదయం 11 గం. 46 ని. లకు విడుదల చేయనున్నట్లు వారు ప్రకటించారు. నిజానికి ఈ గ్లింప్స్ ఇప్పటికి విడుదల చేయబడాలి, కానీ మేకర్స్ ప్రేక్షకులకు మంచి క్వాలిటీ అవుట్‌పుట్‌ను అందించాలని కోరుకోవడంతో ఇది ఆలస్యం అయింది. విజయ్ కార్తికేయ ఈ మూవీకి దర్శకుడు. కిచ్చా క్రియేషన్స్‌తో కలిసి వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలై పులి ఎస్ థాను ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ దీనికి సంగీత దర్శకుడు. కాగా ఈ ప్రాజక్ట్ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు