సమీక్ష : లవ్ యు రామ్ – స్లోగా సాగే లవ్ డ్రామా

సమీక్ష : లవ్ యు రామ్ – స్లోగా సాగే లవ్ డ్రామా

Published on Jun 30, 2023 8:00 PM IST
Love You Ram Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 30, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్, దశరధ్, బెనేజీ, ప్రశాంత్ శర్మ, శ్రీ మీర్, ప్రదీప్ కొండిపర్తి తదితరులు

దర్శకుడు : డివై చౌదరి

నిర్మాత: డివై చౌదరి మరియు దశరధ్

సంగీతం: కె వేదా

సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్

ఎడిటర్: ఎస్ బి ఉద్దవ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ దర్శకుడు దశరధ్ కథ రచించి నిర్మించిన తాజా సినిమా లవ్ యు రామ్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి దీని యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

 

నార్వేలోని ఓస్లోలో ఒక స్వార్థపూరిత వ్యాపారవేత్త అయిన రామ్ (రోహిత్ బెహల్) తన వ్యాపార సమస్యను పరిష్కరించడానికి విధేయురాలైన ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. అందుకోసం ఖమ్మంలోని రెడ్‌క్రాస్‌లో పనిచేస్తున్న మధ్య తరగతి అమ్మాయి దివ్యను ఎంపిక చేసుకుంటాడు. అయితే ఆ తరువాత దివ్య తమ పెళ్లి వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుంటుంది. మరి దివ్య తర్వాత ఏం చేస్తుంది, అతనితో విడిపోతుందా లేదా అతనిని మారుస్తుందా, రామ్ తన వ్యాపార సమస్యను పరిష్కరించుకుంటాడా అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే లవ్ యు రామ్ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

రోహిత్ బెహల్ స్వార్థపూరిత నటుడిగా ఎంతో అద్భుతంగా నటనను ప్రదర్శించాడు, నిజానికి అతడి నటన ప్రేక్షకుల్లో ఒకింత అసహ్యాన్ని కలిగిస్తుంది. ఆవిధంగా సహజత్వ నటన కనబరిచాడు. అపర్ణ జనార్దనన్ పోషించిన దివ్య ప్రశాంతమైన మరియు ఆకట్టుకునే పాత్ర, ఆకట్టుకునే అందం అభినయంతో ఆమె అలరించారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నిర్మాత మరియు రచయిత దశరధ్ తన నటనా నైపుణ్యంతో ఆశ్చర్యపరిచారు, అలానే కొని సీన్స్ ద్వారా నవ్వులు పూయించారు. ఇంకా ఈ సినిమాలో విజువల్స్ బాగుండడంతో పాటు ఆహ్లాదపరిచే రెండు పాటలు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరింత మంచి ప్లస్.

 

మైనస్ పాయింట్స్ :

 

నిజానికి ఈ సినిమాలో కథే ప్రధాన సమస్య. ఇది పాతదిగా అనిపిస్తుంది మరియు చాలావరకు ఆడియన్స్ కి విసుగు కలిగిస్తుంది. స్లోగా ఉన్న రైటింగ్ మరియు స్క్రీన్ ప్లే దీనికి కారణం. కిషోర్ గోపు మరియు శివ మొక్కా ఇద్దరూ కూడా కె దశరధ్ రచనను మరింతగా మెరుగుపరిచి ఉండవచ్చు. స్క్రీన్‌ప్లే విసుగును మరింత పెంచి భరించలేనిదిగా చేస్తుంది. ప్రధాన నటీనటులు మరియు దశరధ్ పాత్రలు మినహా, ఇతర నటీనటులు కథాంశానికి సహకరించడానికి ఏమీ లేదు. సినిమా పూర్తయ్యాక సెకండాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ గా అనిపిస్తుంది. హీరోయిన్, ఆమె కుటుంబం మరియు రామ్ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటే, అది సినిమా రిజల్ట్ ని మార్చివేసి ఉండవచ్చు. కాగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు అనవసరమైనవిగా అనిపిస్తాయి. సినిమా అకస్మాత్తుగా సీరియస్ సన్నివేశాల నుండి కామెడీ సన్నివేశాలకు మారి ఒకింత గందరగోళాన్ని సృష్టిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

దర్శకుడు డి.వై.చౌదరి, రచయిత దశరధ్ కథ, స్క్రీన్‌ప్లే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటె తప్పకుండా లవ్ యూ రామ్‌ సక్సెస్ఫుల్ సినిమాగా నిలిచేది. ప్రవీణ్ వర్మ డైలాగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. ముందుగా చెప్పినట్లుగా, కె వేద సంగీతం పర్వాలేదనిపించి రెండు పాటలు ఉపశమనం కలిగిస్తాయి. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఎస్‌బి ఉద్ధవ్ చాలా వరకు అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సీన్స్ లో కొన్ని కట్ చేయాల్సింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సంతృప్తికరంగా ఉన్నాయి.

 

తీర్పు :

 

మొత్తంగా లవ్ యు రామ్ పెద్దగా ఆకట్టుకోని లవ్ డ్రామా అని చెప్పాలి. బలహీనమైన కథాంశం మరియు నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే దీనికి పెద్ద మైనస్. ప్రధాన నటీనటుల మెచ్చుకోదగిన నటన మరియు దశరధ్ యొక్క కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ, మిగతా అంశాలు ఫెయిల్ అవ్వడంతో ఇది అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు